19, మార్చి 2024, మంగళవారం

Sivaranjani : Joru Meeduna Song Lyrics (జోరుమీదున్నావు తుమ్మెదా)

చిత్రం: శివరంజని (1978)

రచన: సి.నారాయణ రెడ్డి

గానం: పి. సుశీల

సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు


పల్లవి:

జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా

చరణం:1 ముస్తాబు అయ్యావు తుమ్మెదా కస్తూరి రాసావు తుమ్మెదా మసక ఎన్నెల్లోన తుమ్మెదా మల్లెపందిరి కాడ తుమ్మెదా మాల కడుతున్నావు తుమ్మెదా ఆ మాలెవరికోసమే తుమ్మెదా జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా

చరణం:2 మెత్తన్ని పరుపూలు తుమ్మెదా గుత్తంగ కుట్టావు తుమ్మెదా ఒత్తైన పరుపుపై తుమ్మెదా. అత్తర్లు చల్లావు తుమ్మెదా ... ఆ ... ఆ... ఆ... ఆ... ఆ పక్కవేసుంచావు తుమ్మెదా ఆ పక్కెవరికోసమే తుమ్మెదా జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి