25, మార్చి 2024, సోమవారం

Maga Maharaju : Evaremi Antunna Song Lyrics (నేల మీద ఓ దేవతలై )

చిత్రం: మగ మహారాజు (2015)

రచన: వెన్నెలకంటి

గానం: కుట్లే ఖాన్, పాలకట్టు శ్రీరామ్, సూరజ్ సంతోష్ & ముఖేష్

సంగీతం: హిప్ హాప్ తమిజా



పల్లవి  :

నేల మీద ఓ దేవతలై దేవతలై

చిరునవ్వులతో మమ్ము దీవించండి ... దీవించండి

నింగిలోన నింగిలోన కోటి తారకలై

కొత్త కాంతులతో మాలో జీవించండి

మకరందంలో లేని ఆ మాధుర్యం అంతా

మన బంధంలో కన్నా నే ధన్యున్ననుకున్నా

గుండెల్లో చెమ్మే గుండెల్లో చెమ్మె

కళ్ళల్లో చిమ్మే ఓ కళ్ళల్లో చిమ్మే

పండంటి జన్మే పండంటి జన్నే

రాశాడు బ్రమ్మే రాశాడు బ్రమ్మే

ఎవరేమి అంటున్న ఎవరేమి చేస్తున్న

అనుబంధమే నాడు తీరనిది

నేనున్న ఈ రోజు నే లేని ఆ రోజు

అనురాగం అనురాగం తీయనిది.

మా గుండెల గుడిలోన కొలువున్నది నీవెలే

నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకెలే.

ఓ, ఓ, ఓ, ఓ, ఓ, ఓ.

చరణం : 1 మమకారమన్నది లేనింటికీ మా లక్ష్మి ఏ నాడు రానేరాదు,

ఆప్యాయత అన్నది లేని నాడు

ఆ మనిషి బతుకసలు బతుకే కాదు.

విడిపోయి కూడే వేళ భారాలే తీరేను,

దూరాన నావే నాడో తీరాన్ని చేరేను, .

ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే, మళ్ళీ

ఈ బంధం నాకిమ్మని వరమడిగేస్తా.(ఎవరేమి),

చరణం : 2

సంతోషం సంతాపం ఏమొచ్చినా గాని

సంతోషం మాత్రం మేం పంచుకుంటాం

దేవుల్లలా మీరు మా కళ్ళ ముందుంటే

సేవకులై సేవ చేసుకుంటాం

చెట్టుని రాయెత్తి కొడితే తీయని పల్లివ్వదా

పుడమిని గుండెల్లో కొలువ పుత్తడి సిరులివ్వదా

ఇంకోలోకంలో నేనుండే నాడైనా

మళ్లీ ఈ ఇంట్లో పుట్టే వరమడిగేస్తా .


ఎవరేమి అంటున్న ఎవరేమి చేస్తున్న

అనుబంధమే నాడు తీరనిది

నేనున్న ఈ రోజు నే లేని ఆ రోజు

అనురాగం అనురాగం తీయనిది.

మా గుండెల గుడిలోన కొలువున్నది నీవెలే

నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకెలే.

ఓ, ఓ, ఓ, ఓ, ఓ, ఓ.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి