25, మార్చి 2024, సోమవారం

Maga Maharaju : Seethe Ramudi Katnam Song (సీతే రాముడి కట్నం)

చిత్రం: మగ మహారాజు (1983)

రచన:

గానం: వాణి జయరామ్

సంగీతం: చక్రవర్తి


పల్లవి  :

సీతే రాముడి కట్నం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం రామయ్యే సీతమ్మకు పేరంటం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం

చరణం : 1

సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే ఏడు అడుగులు నడిచేది ఏడు జన్మల కలయికకే పడతులకైనా పురుషులకైనా ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం

చరణం : 2

ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం రామకథలుగా వెలసేది స్త్రీల ఋజువుగా నిలిచేది ఆనాడైనా ఏనాడీనా సీతమ్మ రామయ్యల కళ్యాణం సీతమ్మ రామయ్యల కళ్యాణం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం ఆ ఆ ఆ ఆ ఉం ఉం ఉం ఉం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి