Maga Maharaju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Maga Maharaju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మార్చి 2024, సోమవారం

Maga Maharaju : Nee Daari Poola Daari Song Lyrics (నీ దారి పూల దారి)

చిత్రం: మగ మహారాజు (1983)

రచన:

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: చక్రవర్తి


పల్లవి  :

నీ దారి పూల దారి పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించక ధ్వనించు విజయ భేరి నీ ఆశలే ఫలించక ధ్వనించు విజయ భేరి

నీ దారి పూల దారి పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించక ధ్వనించు విజయ భేరి నీ ఆశలే ఫలించక ధ్వనించు విజయ భేరి
చరణం : 1 ఆశయాలు గురిగా సాహసాలు సిరిగా సాగాలి జైత్రరధం వడి వడిగా...
మలుపులెన్ని ఉన్నా గెలుపు నీది రన్నా సాగించు మనోరధం మనిషిగా... నరుడివై హరుడివై 
నారాయణుడే నీవై, నీ వాసలే ఫలించగా వరించు విజయ లక్ష్మి.. నీ వాసలే ఫలించగా వరించు విజయ లక్ష్మి...
నీ దారి పూల దారి పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించక ధ్వనించు విజయ భేరి నీ ఆశలే ఫలించక ధ్వనించు విజయ భేరి అయ్యప్పా.... స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్పా.... స్వామియే శరణమయ్యప్ప.
చరణం : 2  కాళరాత్రి ముగిసే కాంతి రేఖ మెరిసే నీ మండిన గుండెల నిట్టూర్పులలో... చల్ల గాలి విసిరే.. తల్లి చెయ్యి తగిలే..  
నీకోసం నిండిన ఓదార్పులతో.... విజయమో విలయమో విధి విలాసమాడైన  
నీ రక్తమే జ్వలించగా జయించు ఆత్మ శక్తి నీ రక్తమే జ్వలించగా జయించు ఆత్మ శక్తి
నీ దారి పూల దారి పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించక ధ్వనించు విజయ భేరి నీ ఆశలే ఫలించక ధ్వనించు విజయ భేరి అయ్యప్పా.... స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్పా.... స్వామియే శరణమయ్యప్ప. చరణం : 3 దిక్కులన్నీ కలిసే.... దైవమొకటి వెలసే.... నీ రక్తం అభిషేకం చేస్తుంటే..
మతములన్నీ కరిగే.. మమత దివ్వే వెలిగే... నీ ప్రాణం నైవైద్యం పెడుతుంటే... వీరుడివై.. ధీరుడివై..  విక్రమార్కుడివి నీవై.... నీ లక్ష్యమే సిద్దించగా దీవించు దైవ శక్తి. నీ లక్ష్యమే సిద్దించగా దీవించు దైవ శక్తి.

Maga Maharaju : Seethe Ramudi Katnam Song (సీతే రాముడి కట్నం)

చిత్రం: మగ మహారాజు (1983)

రచన:

గానం: వాణి జయరామ్

సంగీతం: చక్రవర్తి


పల్లవి  :

సీతే రాముడి కట్నం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం రామయ్యే సీతమ్మకు పేరంటం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం

చరణం : 1

సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే ఏడు అడుగులు నడిచేది ఏడు జన్మల కలయికకే పడతులకైనా పురుషులకైనా ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం

చరణం : 2

ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం రామకథలుగా వెలసేది స్త్రీల ఋజువుగా నిలిచేది ఆనాడైనా ఏనాడీనా సీతమ్మ రామయ్యల కళ్యాణం సీతమ్మ రామయ్యల కళ్యాణం సీతే రాముడి కట్నం ఆ సీతకు రాముడు దైవం అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం ఆ ఆ ఆ ఆ ఉం ఉం ఉం ఉం


Maga Maharaju : Evaremi Antunna Song Lyrics (నేల మీద ఓ దేవతలై )

చిత్రం: మగ మహారాజు (2015)

రచన: వెన్నెలకంటి

గానం: కుట్లే ఖాన్, పాలకట్టు శ్రీరామ్, సూరజ్ సంతోష్ & ముఖేష్

సంగీతం: హిప్ హాప్ తమిజా



పల్లవి  :

నేల మీద ఓ దేవతలై దేవతలై

చిరునవ్వులతో మమ్ము దీవించండి ... దీవించండి

నింగిలోన నింగిలోన కోటి తారకలై

కొత్త కాంతులతో మాలో జీవించండి

మకరందంలో లేని ఆ మాధుర్యం అంతా

మన బంధంలో కన్నా నే ధన్యున్ననుకున్నా

గుండెల్లో చెమ్మే గుండెల్లో చెమ్మె

కళ్ళల్లో చిమ్మే ఓ కళ్ళల్లో చిమ్మే

పండంటి జన్మే పండంటి జన్నే

రాశాడు బ్రమ్మే రాశాడు బ్రమ్మే

ఎవరేమి అంటున్న ఎవరేమి చేస్తున్న

అనుబంధమే నాడు తీరనిది

నేనున్న ఈ రోజు నే లేని ఆ రోజు

అనురాగం అనురాగం తీయనిది.

మా గుండెల గుడిలోన కొలువున్నది నీవెలే

నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకెలే.

ఓ, ఓ, ఓ, ఓ, ఓ, ఓ.

చరణం : 1 మమకారమన్నది లేనింటికీ మా లక్ష్మి ఏ నాడు రానేరాదు,

ఆప్యాయత అన్నది లేని నాడు

ఆ మనిషి బతుకసలు బతుకే కాదు.

విడిపోయి కూడే వేళ భారాలే తీరేను,

దూరాన నావే నాడో తీరాన్ని చేరేను, .

ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే, మళ్ళీ

ఈ బంధం నాకిమ్మని వరమడిగేస్తా.(ఎవరేమి),

చరణం : 2

సంతోషం సంతాపం ఏమొచ్చినా గాని

సంతోషం మాత్రం మేం పంచుకుంటాం

దేవుల్లలా మీరు మా కళ్ళ ముందుంటే

సేవకులై సేవ చేసుకుంటాం

చెట్టుని రాయెత్తి కొడితే తీయని పల్లివ్వదా

పుడమిని గుండెల్లో కొలువ పుత్తడి సిరులివ్వదా

ఇంకోలోకంలో నేనుండే నాడైనా

మళ్లీ ఈ ఇంట్లో పుట్టే వరమడిగేస్తా .


ఎవరేమి అంటున్న ఎవరేమి చేస్తున్న

అనుబంధమే నాడు తీరనిది

నేనున్న ఈ రోజు నే లేని ఆ రోజు

అనురాగం అనురాగం తీయనిది.

మా గుండెల గుడిలోన కొలువున్నది నీవెలే

నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకెలే.

ఓ, ఓ, ఓ, ఓ, ఓ, ఓ.