24, మార్చి 2024, ఆదివారం

Mahanati : Gelupuleni Samaram Lyrics (గెలుపు లేని సమరం)

చిత్రం: మహానటి (2018)

రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: రమ్య బెహరా

సంగీతం: మిక్కీ జె మేయర్




గెలుపు లేని సమరం జరుపుతోంది సమయం ముగించేదెలా ఈ రణం మధురమైన గాయం మర్చిపోదు హృదయం ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం గతంలో విహారం..కలల్లోని తీరం అదంతా భ్రమంటే.. మనస్సంతా మంటే ఏవో జ్ఞాపకాలు..వెంటాడే క్షణాలు దహిస్తుంటే దేహం..వెతుక్కుందా మైకం అలలుగా పడి లేచే కడలిని అడిగావా తెలుసా తనకైనా తన కల్లోలం ఆకశం తాకే ఆశ తీరిందా తీరని దాహం ఆగిందా జరిగే మధనంలో.. విషమేదో రసమేదో తేలేన ఎపుడైనా.. ఎన్నాళ్ళైనా పొగలై సెగలై..ఎదలో రగిలే పగలు రేయి ఒకటై నరనరాల్లోన విషమైంది ప్రేమ చివరికి మిగిలేది..ఇదే అయితే విధి రాత..తప్పించ తరమా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి