చిత్రం: మహానటి (2018)
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: శ్రేయా ఘోషల్, అనురాగ్ కులకర్ణి
సంగీతం: మిక్కీ జె మేయర్
మూగ మనసులు మన్ను మిన్ను కలుసుకున్న సీమలో నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో జగతి అంటె మనమే అన్న మాయలో సమయమన్న జాడలేని హాయిలో ఆయువే గేయమై స్వాగతించగా తరలి రావటే చైత్రమా కుహూ కుహూ కుహూ స్వరాల ఊయలూగుతున్న కోయిలైన వేళ మూగ మనసులు మూగ మనసులు ఊహల రూపమా ఊపిరి దీపమా నా చిరునవ్వుల వరమా గాలి సరాగమా పూల పరాగమా నా గత జన్మల ఋణమా ఊసులు బాసలు ఏకమైన శ్వాసలో నిన్నలు రేపులు లీనమైన నేటిలో ఈ నిజం కథ అని తరతరాలు చదవని ఈ కథే నిజమని కలలలోనే గడపని వేరే లోకంచేరే వేగం పెంచే మైకం మననిల తరమని తారాతీరం తాకే దూరం ఎంతో ఏమో అడగకేం ఎవరినీ మూగ మనసులు మూగ మనసులు