చిత్రం: మహానటి (2018)
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: రమ్య బెహరా
సంగీతం: మిక్కీ జె మేయర్
ఆగిపో బాల్యమా, నవ్వులో నాట్యమా... సరదా సిరిమువ్వలవుదాం ఏటిలో వేగమా, పాటలో రాగమా... చిటికెల తాళాలు వేద్దాం ఇంతలో వెళిపోకుమా వెంట వచ్చే నేస్తమా ఇంతలో వెళిపోకుమా వెంట వచ్చే నేస్తమా తొందరగా నన్నే పెంచేసి నువ్వేమో చినబోకుమా ఆగిపో బాల్యమా, నవ్వులో నాట్యమా... సరదా సిరిమువ్వలవుదాం ఏటిలో వేగమా, పాటలో రాగమా ఊరికే పనిలేక, తీరిక అస్సలులేక తోటలో తూనిగాల్లె తిరిగొద్దామ ఎంచక్కా అంత పొడుగెదిగాక తెలుసుకోలేరింక సులువుగా ఉడతల్లె చెట్టెక్కే ఆ చిట్కా నింగికి నిచ్చెన వెయ్యవే నింగికి నిచ్చెన వెయ్యవే గుప్పెడు చుక్కలు కొయ్యవే హారం మల్లె రేపటి మెళ్ళో వెయ్యవే నీ పిలుపే అంది, నలువైపుల నుండి అరచేతుల్లో వాలాయి నీ మది కోరిన కానుకలన్నీ ఆగిపో బాల్యమా, నవ్వులో నాట్యమా... సరదా సిరిమువ్వలవుదాం ఏటిలో వేగమా, పాటలో రాగమ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి