24, మార్చి 2024, ఆదివారం

Maryada Ramanna : Dhada Dhadalade Song Lyrics (హరోం హరోం హర )

చిత్రం: మర్యాద రామన్న (2010)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి  :

హరోం హరోం హర హరహర హరహర హరోం హరోం హర హరహర హరహర హరోం హరోం హర హరహర హరహర పరుగులుతీయ్ బిర బిర బిర బిర  ఉరకలువేయ్ చర చర చర చర చర చర చర చర పరుగులుతీయ్ బిర బిర బిర బిర  ఉరకలువేయ్ చర చర చర చర దడ దడ దడ దడలాడే ఎదసడి ఢమరుకమై  వడి వడి వడి వడిదూకే పదగతి తాండవమై పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై  ముంచుకువచ్చు మౄత్యువుకందని మార్కండేయుడవై  పరుగులుతీయ్ ఉరకలువేయ్  పరుగులుతీయ్ బిర బిర బిర బిర  ఉరకలువేయ్ చర చర చర చర బిరబిర బిరబిర బిరబిర బిరబిర చరచర చరచర చరచర చరచర బిరబిర చరచర బిరబిర చరచర  చరణం : 1

గుత్తుకకోసే కత్తికొనలు .. కత్తికొనలు గుత్తుకకోసే కత్తికొనలు దరిదాపుకుచేరని దూకుడువై ఆయువుతీసే ఆపద కూడా అలసటతో ఆగేలాచేయ్  మట్టిలో తనగిట్టలతో నిను తొక్కేయ్యాలని వచ్చే కాలాశ్వముపై శ్వారీచేయ్  పరుగులుతీయ్ బిర బిర బిర బిర ఉరకలువేయ్ చర చర చర చర పరుగులుతీయ్ బిర బిర బిర బిర ఉరకలువేయ్ చర చర చర చర

చరణం : 2

ఎడారిదారుల తడారిపోయిన ఆశకు చెమటలధారలుపోయ్  నిస్సత్తువతో నిలబడనీయ్యక ఒక్కోఅడుగు ముందుకువేయ్  వందయేళ్ళ నీ నిండు జీవితం గండిపడదనే నమ్మకమై  శతకోటి సమస్యల ఎదుర్కొనేందుకు బతికివుండగల సాహసానివై  పరుగులుతీయ్ పరుగులుతీయ్ .... ఉరకలువేయ్ ఉరకలువేయ్  పరుగులు పరుగులు పరుగులుతీయ్ .. ఉరకలు ఉరకలు ఉరకలువేయ్ బిరబిర చరచర బిరబిర చరచర ... బిరబిర చరచర బిరబిర చరచర  హరోం హరోం హర హరహర హరహర హరోం హరోం హర హరహర హరహర హరోం హరోం హర హరహర హరహర హరోం హరోం హర హరహర హరహర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి