చిత్రం: మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)
రచన: కిట్టు విస్సాప్రగడ
గానం: అనురాగ్ కులకర్ణి
సంగీతం: స్వీకర్ అగస్తీ
పల్లవి : తెల్లారే ఊరంతా తయ్యారే ముస్తాబై పిలిచింది గుంటూరే రద్దీలో యుధ్ధాలే మొదలాయే తగ్గేదే లేదంటే ప్రతి వాడే మరుపే రాని ఊరే గుంటూరే!! అలుపంటూ లేదంటే సూరీడే పగలంతా తడిసేలే సొక్కాలే ఎన్నెన్నో సరదాలే కొలువుంటే కారాలే నూరేది అంటారే చరణం 1 : బేరం సారం సాగే దారుల్లోన నోరూరించే మిర్చీ బజ్జీ తగిలే దారం నుంచీ సారే సీరల దాకా గాలం ఏసి పట్నం బజారు పిలిసే ఏ పులిహోర దోస - బ్రాడిపేట బిరియానికైతే - సుబాని మామ వంకాయ బజ్జీ - ఆరో లైను గోంగూర సికెను - బృందావనము మస్సాల ముంత - సంగడి గుంట మాల్ పూరీ - కొత్త పేట చిట్టి ఇడ్లీ - లక్ష్మీ పురము చెక్క పకోడీ - మూడొంతెనలు గుటకే పడక కడుపే తిడితే సబ్జా గింజల సోడా బుస్సందే పొడికారం నెయ్యేసి పెడుతుంటే పొగచూరే దారుల్లో నోరూరే అడిగిందే తడువంటా ఏదైనా లేదన్న మాటంటూ రాదంటా సరదా పడితే పోదాం గుంటూరే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి