23, మార్చి 2024, శనివారం

Middle Class Melodies : Manchido Cheddadho Song Lyrics (మంచిదో చెడ్డదో)

చిత్రం: మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)

రచన: సనాపతి భరద్వాజ పాత్రుడు

గానం: విజయ్ యేసుదాస్

సంగీతం: స్వీకర్ అగస్తీ



పల్లవి :

మంచిదో చెడ్డదో రెంటికి మద్యేదో అంతుచిక్కలేదా కాలం ఎటువంటిదో కయ్యామో నెయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్కతేలలేదా దాని తీరు ఏమిటో ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటె రాదారి చూపించదా చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండ బదులేయరాదా

చరణం 1 : 

మదిలోని చిరునవ్వు జన్మించగా కలతే పోదా కనుమూయదా నడిరేయి దరిచేరి మసి పూయగా వెలుగేరాదా చెరిపేయదా అరచేతి రేఖల్లో లేదంట రేపు నిన్నల్ని వదిలేసి రావాలి చూపు చూడొద్దు ఎదంటూ ఓదార్పు… వచ్చిపోయే మేఘాలే ఈ బాధలన్నీ ఉండిపోవు కడదాకా ఆ నింగిలా అంతమైతే కారాదు లోలోని దైర్యం అంతులేని వ్యధలే ఉన్నా చరణం 2:  సంద్రాన్ని పోలింది ఈ జీవితం తెలిసి తీరాలి ఎదురీదడం పొరపాటు కాదంట పడిపోవడం ఉండాలో లేచే గుణం ఎటువంటి ఆటంకం ఎదురైనా గాని మునుముందు కెల్లేటి అలవాటు మాని కెరటాలు ఆగేటి రోజేదని గంథాలన్నీ ఏనాడూ తీసేటి కాలం వాస్తవాన్ని కళ్లారా చుపించదా కమ్ముకున్న భ్రమలన్నీ కావలి మాయం కిందపడ్డ తరువాతైనా తన్నెనా తన్నెనా తన్నెనా తన్నెనా తానే నానా నానా తానే నానా నానా (2)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి