23, మార్చి 2024, శనివారం

Middle Class Melodies : Keelu Gurram Song Lyrics (కీలుగుర్రమెక్కాడే…)

చిత్రం: మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)

రచన: సనాపతి భరద్వాజ పాత్రుడు

గానం: అనురాగ్ కులకర్ణి, స్వీకర్ అగస్తీ, రమ్య బెహరా

సంగీతం: స్వీకర్ అగస్తీ



పల్లవి :

కీలుగుర్రమెక్కాడే… కిందామీదా పడ్డాడే రాకుమారి కావాలన్నాడే… ఊబిలోకి దూకాడే… ఊతా గట్రా లేనోడే ఊరినల్ల ఏలాలన్నాడే… గాలిగాడు తీరేమారీ… దారిలోకి వచ్చాడే యావ మీద… యాపారాన్నే పెట్టాడే ఆరునూరు అయ్యేదాకా… ఆవలించనన్నాడే ఆగలేక సాగే లాగే ఉన్నాడే… హే..! స్వారీ చెయ్ రా కాలం మీద… సీకుసింతలున్నోడే… సున్నా కన్నా సిన్నోడే సిన్న సూపు సూడొద్దన్నాడే… జీవితాన్ని పిల్లోడే… పట్టాలెక్కించేసాడే మైలు రాయి దాటించేసాడే… నోటి నీరు ఊరే ఊరే… వంట ఈడు సేత్తాడే తిన్నవాడు ఆహాలోకం సూత్తాడే… నోటు మీద గాంధీతాతే… నవ్వుకుంటు వచ్చాడే నవ్వుకుంట గల్లాపెట్టీ సేరాడే… హే ..!అడ్డే నీకు లేదియ్యాల

చరణం 1 :  నీకై వీచే పిల్లగాలి ఈవేళ… శ్వాసల్లే చేరిందా ఎదలో నిన్నా మొన్నా ఉన్న బాధ ఈవేళ… హాయల్లే మారిందా మదిలో సడి లేని జడివాన… సరదాగా కురిసిందా మనసారా తడిలోన… పొడి ప్రాణం తడిసిందా గుండెల్లో ఉండే ప్రేమ… కళ్ళల్లో చేరిందమ్మా చూపుల్లో ఉండే ప్రేమ… దాగేనా దాచాలన్న… కుదరదు సుమా అసలొక్కమాటైనా… ఎవరితో అనకుండా అలిగెలిపోయింది దూరమెందుకో అంతు లేని సంతోషం… గంతులేసే ఈ నిమిషం ఇద్దరొక్కటయ్యారోయ్… ఇపుడే ఇపుడే ఏ బాధాబందీ… లేదియ్యాల

చరణం 2:  ఉంది నేడు బాగానే… నిన్నా మొన్నా లాగానే రేపు కూడ ఉంటాదంటావా..? గడ్డురోజులొస్తేనే… కష్టం సుట్టం ఐతేనే మార్పు నీలో వస్తాదంటావా..? ఈతిబాధలొచ్చాయంటూ… బోరుబోరుమంటావా వద్దు వద్దు అంటే… నువ్వే ఇంటావా ఓడ లేని రేవే నీవై… బోసిపోయి ఉంటావా ఓడిపోని వారే లేరోయ్ సూస్తావా హే..! సాయం జేసే కాలం రాదా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి