31, మార్చి 2024, ఆదివారం

Seethayya (Seethaiah) : Siggestundi Ninu Chustunte Song Lyrics (సిగ్గేస్తోంది నిను చూస్తుంటే)

చిత్రం: సీతయ్య (2003)

రచన: చంద్రబోస్

గానం: ఎం. ఎం. కీరవాణి , శ్రేయ ఘోషల్

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి:

సిగ్గేస్తోంది నిను చూస్తుంటే సిగ్గేస్తోంది నీ మాటింటే సిగ్గేస్తోంది నీతో వుంటే సిగ్గేస్తోంది ఆలోచిస్తే సిగ్గేస్తోంది అడుగే వేస్తే సిగ్గేస్తోంది అందాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యొ....కళ్ళలో కడివెడు సిగ్గు బుగ్గలో గుప్పెడు సిగ్గు ఒళ్ళంత ఒకటే సిగ్గు

చరణం:1

ముద్దిమ్మని నా అంతట నేను పెదవే విప్పి అడగాలంటె అయ్బాబోయ్ సిగ్గు ఇస్తానని తానంతట తాను ఎదురే వచ్చి ఇదుగో అంటె అడ్డగోలు సిగ్గు కొ కొ కొకొకొ కొకొకొకొ కొకొకొ కలాగుతుంటె సిగ్గు చి చి చిచిచి చిచిచి చిలిపి సైగచేస్తె సిగ్గు వెలపుల సిగ్గు లొలోపల సిగ్గు శిగపూవై వున్నోడు బుగ్గంత తడిమేస్తుంటె సిగ్గు....

చరణం:2

రాతిరి తాను నిద్దర మాని నా కలలోనె తిరిగేస్తుంటె వొరినాయనో సిగ్గు కలలో కలిగిన అలసటతో నా వొళ్ళోనె నిదురిస్తానంటె ఎక్కడ్లేని సిగ్గు ఒ ఒ ఒ ఊఊ ఊఒ ఊహ తరుముతుంటె సిగ్గు అ అ అ ఆఅ ఆ ఆశ కలుగుతుంటె సిగ్గు తొలుతలొ సిగ్గు నను తొలిచిన సిగ్గు చిదిమేసె చిన్నోడికి సిగ్గంటు చెప్పాలంటె సిగ్గు.

సిగ్గేస్తోంది నిను చూస్తుంటే సిగ్గేస్తోంది నీ మాటింటే సిగ్గేస్తోంది నీతో వుంటే సిగ్గేస్తోంది ఆలోచిస్తే సిగ్గేస్తోంది అడుగే వేస్తే సిగ్గేస్తోంది అందాకొస్తే ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యొ....కళ్ళలో కడివెడు సిగ్గు బుగ్గలో గుప్పెడు సిగ్గు ఒళ్ళంత ఒకటే సిగ్గు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి