1, మార్చి 2024, శుక్రవారం

Pedababu : Oka Vekuva Song Lyrics (ఒక వేకువ దీపంతో )

చిత్రం: పెదబాబు (2004)

రచన: జాలాది

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: చక్రి



పల్లవి: ఒక వేకువ దీపంతో ...ఈ లోకం మేలుకొని... ఒక దేవుడి రూపంతో తన దీవెనలందుకొని.... ముసి ముసి నవ్వుల .... విరిసిన పువ్వుల.... పల్లె ఘల్లుమందీ.... ఆ వెలసిన దేవుడి ముంగిట నిలబడి...తలలు వంచుకుంది హరి ఓం శాంతి శాంతి.... డమరుక నాద విశ్వశాంతి... భం చిక భం చిక చమ్ చక్క.. చక్కనమ్మ ముగ్గులెట్టె ఎంచక్కా... పాడిపంట పొంగులాడే భం చిక.... ఊరువాడ చిందులాడే ఎంచక్కా... ధన ధాన్య రాసులు పోసి.... ధర్మానికి దోసిళ్ళేసి గుణ శీలం జనకొలు వైతే మహదేవుడు మారాజైతే ముత్యాల పండే లోగిళ్ళలో వరాలనవ్వుల జల్లంటరో... చుక్కల్లో వెన్నెల బొమ్మ.... పుట్టింటికి నడిచొస్తుంటే... పక్కన చిరునవ్వుల వాడే... శివదేవుడు అనిపిస్తుంటే... ఆ తాత మనవళ్లాట... ఈ ఊరికిఊయల పాట... ఆ కుంకుమ రేకుల ముట..మా గడపకి వచ్చిన పూట... పండగే వచ్చినంత సందడంటరో.... సందెపొద్దు చిందులాడె వేడుకంటరో... హరి ఓం శాంతి శాంతి డమరుక నాద విశ్వ శాంతి అనురాగం పురుడోసుకుని అనుబంధం ముడులేసుకుని దేవుడుమనిషై పుడుతుంటే... నలుగురితో నడిచొస్తుంటే... బుడి బుడి అడుగుల నాట్యానికీ ఆ నటరాజే గురుతొచ్చేనట మనిషిని మహానీయుడు జేసీ.... మమతల గుడి ఒడి జేసుకుని.... కనిపించే తల్లులు వుంటే.... లోకాలను వెలిగిస్తుంటే.... ఆ వెలుతురు కిన్నెరబాట తాతయ్యకు వెన్నెల కోట ఆ కోటకు రారాజెవరో ఈకాలమె చెప్పేనంటా ఝూం కొకో ఝూం కొకో కోడి పుంజురో.... జాతికోడి కూతలేసే పండగంటరో... చంకలాడే సంకురాతి రొచ్చెనంటరో.... గొబ్బిళ్లమ్మ పువ్వులెట్టి ముగ్గులంటరో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి