Pedababu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pedababu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, మార్చి 2024, శుక్రవారం

Pedababu : Oka Devudu Song Lyrics (ఒక దేవుడు మనిషైతే)

చిత్రం: పెదబాబు (2004)

రచన: జాలాది

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: చక్రి



ఒక దేవుడు మనిషైతే...తన తల్లికి ఎడమైతే.... విలపించే అనురాగం... విలువెంతో తెలిసేది.... చిటికెడు కుంకుమ తల్లికి పంచే కొడుకై పుట్టాలా కంచికి చేరని కధలా బ్రతుకు విలవిల ఏడ్వాలా.... ఏడడుగుల జీవితమా... ఇది దేవుడి శాసనమా.. ఏడ్పించే నా గతమా ఓదార్చని జీవితమా......!

Pedababu : Oka Vekuva Song Lyrics (ఒక వేకువ దీపంతో )

చిత్రం: పెదబాబు (2004)

రచన: జాలాది

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: చక్రి



పల్లవి: ఒక వేకువ దీపంతో ...ఈ లోకం మేలుకొని... ఒక దేవుడి రూపంతో తన దీవెనలందుకొని.... ముసి ముసి నవ్వుల .... విరిసిన పువ్వుల.... పల్లె ఘల్లుమందీ.... ఆ వెలసిన దేవుడి ముంగిట నిలబడి...తలలు వంచుకుంది హరి ఓం శాంతి శాంతి.... డమరుక నాద విశ్వశాంతి... భం చిక భం చిక చమ్ చక్క.. చక్కనమ్మ ముగ్గులెట్టె ఎంచక్కా... పాడిపంట పొంగులాడే భం చిక.... ఊరువాడ చిందులాడే ఎంచక్కా... ధన ధాన్య రాసులు పోసి.... ధర్మానికి దోసిళ్ళేసి గుణ శీలం జనకొలు వైతే మహదేవుడు మారాజైతే ముత్యాల పండే లోగిళ్ళలో వరాలనవ్వుల జల్లంటరో... చుక్కల్లో వెన్నెల బొమ్మ.... పుట్టింటికి నడిచొస్తుంటే... పక్కన చిరునవ్వుల వాడే... శివదేవుడు అనిపిస్తుంటే... ఆ తాత మనవళ్లాట... ఈ ఊరికిఊయల పాట... ఆ కుంకుమ రేకుల ముట..మా గడపకి వచ్చిన పూట... పండగే వచ్చినంత సందడంటరో.... సందెపొద్దు చిందులాడె వేడుకంటరో... హరి ఓం శాంతి శాంతి డమరుక నాద విశ్వ శాంతి అనురాగం పురుడోసుకుని అనుబంధం ముడులేసుకుని దేవుడుమనిషై పుడుతుంటే... నలుగురితో నడిచొస్తుంటే... బుడి బుడి అడుగుల నాట్యానికీ ఆ నటరాజే గురుతొచ్చేనట మనిషిని మహానీయుడు జేసీ.... మమతల గుడి ఒడి జేసుకుని.... కనిపించే తల్లులు వుంటే.... లోకాలను వెలిగిస్తుంటే.... ఆ వెలుతురు కిన్నెరబాట తాతయ్యకు వెన్నెల కోట ఆ కోటకు రారాజెవరో ఈకాలమె చెప్పేనంటా ఝూం కొకో ఝూం కొకో కోడి పుంజురో.... జాతికోడి కూతలేసే పండగంటరో... చంకలాడే సంకురాతి రొచ్చెనంటరో.... గొబ్బిళ్లమ్మ పువ్వులెట్టి ముగ్గులంటరో

Pedababu : Navvavaiah Babu Song Lyrics (నవ్వవయ్య బాబూ)

చిత్రం: పెదబాబు (2004)

రచన: భాస్కరభట్ల రవికుమార్

గానం: చక్రి ,కౌసల్య

సంగీతం: చక్రి




నవ్వవయ్య బాబూ నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది నవ్వు దొరబాబూ అరె నీకేమయ్యింది, చిరునవ్వే రాకుంది అరె నీకేమయ్యింది, చిరునవ్వే రాకుంది ఆడదిలా వెంటపడి అడుగుతుండగా మూతినలా ముడుచుకుని ఎంతసేపటా తెగ ఉరిమిన ఆకశాన నవ్వు చినుకులే, నవ్వు చినుకులే ఓయ్ పెదబాబు నవ్వవయ్య బాబూ నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది మూటలే తరిగేనా, కోటలే కూలేనా నవ్వితే ఓసారి, కొంపలే మునిగేనా వింతలే జరిగేనా, ఇంతలో ఏవైనా నవ్వితే మనసారా, కొండలేం కరిగేనా నేను చూడలేదురోయ్ నువ్వు నవ్వగా అంత కోపమెందుకోయ్ వరుసకు బావా ఇదిగో ఈవేళ నవ్వాలా పకపకమని కిలకిలమని కాకుల రొదలా ఏయ్ ఏంటీ? కోకిలా శృతిలా నవ్వవయ్య బాబూ నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది నీ సొమ్మేం పోతుంది, నీ సోకేం పోతుంది మణులే అడిగానా, మాన్యాలడిగానా నవ్ తప్ప ఏమైనా, నిన్ను నేనడిగానా నగలే అడిగానా, నాణ్యాలడిగానా చిన్న నవ్వు కాకుండా, చీరలే అడిగానా దాచుకోకు నవ్వునీ పెదవి చాటున ఫక్కుమంటు నవ్వితే చాలనుకోనా చెబుతా వింటావా ఇపుడైనా పడిపడి నువ్వు నవ్వర మరి నా అత్తకొడకా ఒళ్ళెలా ఉందే? కాదని అనక ఒరేయ్ పెదబాబు నవ్వు దొరసాని చిరునవ్వుల సవ్వడితో, నువ్వు సందడి చెయ్యాలి చిరునవ్వుల సవ్వడితో, నువ్వు సందడి చెయ్యాలి నవ్వు నీలవేణి కొంటెనవ్వుల పల్లకిలో, నిన్ను రోజూ చూడాలి కొంటెనవ్వుల పల్లకిలో, నిన్ను రోజూ చూడాలి నిత్యమల్లెపువ్వులాగ నువ్వు ముద్దుగా నవ్వుతుంటే ముత్యమైన సాటిరాదుగా గలగలమని నవ్వుతుంటే నాకు పండగ, నాకు పండగ

Pedababu : Naalo Nuvvundali Song Lyrics (నాలో నువ్వుండాలి)

చిత్రం: పెదబాబు (2004)

రచన: భాస్కరభట్ల రవికుమార్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,కౌసల్య

సంగీతం: చక్రి



ఆ: నాలో నువ్వుండాలి... నీలో నేనిండాలి నువ్వే నేనవ్వాలి ఏనాటికీ జ: నా వెంట నడిచాకా….నా చెంటే చేరాకా నువ్వంటే నేనేగా ముమ్మాటికీ ఆ: వద్దన్నా వినకుండా నువ్వు సాయం చేస్తుంటే పదిమందీ చూశారా బాగోదులే అ: ఎవరేమీ అనుకున్నా ఎగతాళే చేస్తున్నాను నీ సేవలో నిత్యం వుంటానులే …. ఆ: ||నాలో|| ఆ:నీతో నిమిషం మాటాడినా నూరేళ్ల సావాసం అనిపించదా…. జ: యుగమే క్షణమైపొతుందిగా నీవైపు ఫలమో ​​ఇది నీ తోడే ఒక వరమై దొరికిందని అనిపించగ సంతోషమే జ:మూసిన ఆ: కనులు అ: దాచెను ఆ; కలలు జ: ఊసులే ఆ: మొదలై అ:ఆశలే ఆ:అలలై జ: నదిలో ఆ: మదిలో జ: ఊరికే ఆ: జడిలో జ: ఒకసారి ఆ: ఒడిచేరి జ: మురిసేనంటా…. ఆ:||నాలో|| ఆ: పతిలో దైవం కనిపించగా ప్రతిరోజు ప్రేమించి పూజించనా అ: ఇలలో స్వర్గం ఇల్లెననీ ఇల్లాలిగా నిన్నుపంపించెనా ఆ:నా గుండెకు నీ నవ్వులే నులివెచ్చని కిరణాలై తాకినవని కలిగెను మరి ఆనందాలే జ: నీకిది ఆ: తెలుసు అ:మూగది ఆ: మనసు జ: నాచెలి ఆ: కురులే జ:పూచిన ఆ:విరులై జ: ఇదిగో ఆ: ఇపుడే జ: తకధిం ఆ: తకతై జ: కదలాడి ఆ: దరిచేరి జ: పిలిచేనంటా