చిత్రం: ప్రేమలేఖ(1996)
సాహిత్యం: భువన చంద్ర
గానం: వందేమాతరం శ్రీనివాస్
సంగీతం : దేవా
పల్లవి :
దిగులు పడకురా సహొదరా,
దుర్గమ్మకరుణించిబ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా
దిగులు పడకురా.. సహొదరా ...
దిగులు పడకురా సహొదరా,
దుర్గమ్మకరుణించిబ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా
దిగులు పడకురా సహొదరా ...
యమ్మా యమ్మా ..
యమ్మా యమ్మా
చినదాన్ని చూడ్లేదమ్మా వల్లోన పడ్లేదమ్మా...
మనసంతా ప్రేమేకదమ్మా.......
దిగులు పడకురా సహొదరా,
దుర్గమ్మకరుణించిబ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా
దిగులు పడకురా సహొదరా ...
చరణం : 1
గాంధీ స్టాచ్యూ ప్రక్కన నే చూసిన ప్రేమవేరురా
జగదాంబ ధియేటర్లో చూసిన ప్రేమవేరురా
ఉడా పార్కు ఫోయే ప్రేమ వచ్చేటప్పుడు మిగలదు
వి ఐ పి కి ప్రేమవస్తే హొటల్ రూమ్ దొరకదు
ఆటో ఎక్కి తిరుగుతుంటే ......
ఎ ఎ ఎ ఎ ఎ
ఓహొ..
నేనాటో ఎక్కి తిరుగుతుంటే లవ్లోపడ్డజంటరా
మనసుమారి ఇంకోళ్ళని ప్రేమిస్తోంది చూడరా
కళ్ళతో నే చూసిన ప్రేమ కధలు వేరురా
ఉన్నతమయిన ప్రేమ నీదేరా సోదరా
సహొదరా
సహొదరా సహొదరా
దిగులు పడకురా సహొదరా, దుర్గమ్మకరుణించిబ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా దిగులు పడకురా సహొదరా ...
చరణం : 2
లిఫ్ట్ అడిగి వచ్చే ప్రేమ షిఫ్ట్ మారి పోయెరా చీరలిచ్చికొన్న ప్రేమ చెయ్యిజారి పోయెరా ఆఫీస్‌లో పుట్టే ప్రేమ ఐదింటికి ముగిసెరా మరోప్రేమ బస్టాపులో ఆరింటికి మొదలురా నూరు రూపాయిల నోటుచూస్తే .. .ఓ ఓ ఓ ఓ అహా ! నూరు రూపాయి నోటుచూస్తే ప్రేమపుట్టేకాలంరా ఊరుమొత్తం చుట్టిచూస్తే చూసిందంత మాయరా కళ్ళతో నే చూసిన ప్రేమ కధలు వేరురా ఉన్నతమయిన ప్రేమ నీదేరా సోదరా సహొదరా సహొదరా సహొదరా దిగులు పడకురా సహొదరా, దుర్గమ్మకరుణించిబ్రోచునమ్మా నీ ప్రేమను కాచునమ్మా దిగులు పడకురా సహొదరా యమ్మా యమ్మా .... యమ్మా యమ్మా చినదాన్ని చూడ్లేదమ్మా వల్లోన పడ్లేదమ్మా మనసంతా ప్రేమేకదమ్మా..... దిగులు పడకురా సహొదరా, దుర్గమ్మకరుణించిబ్రోచునమ్మా నీ ప్రేమను కాచునమ్మా దిగులు పడకురా సహొదరా ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి