11, మార్చి 2024, సోమవారం

Prema Lekha : Nee Pilupe Prema Geetham Song Lyrics (నీ పిలుపే ప్రేమగీతం)

చిత్రం: ప్రేమలేఖ(1996)

సాహిత్యం: భువన చంద్ర 

గానం: పి. ఉన్నికృష్ణన్, కె. ఎస్. చిత్ర

సంగీతం : దేవా


పల్లవి :

నీ పిలుపే ప్రేమగీతం నీ పలుకే ప్రేమవేదం ఆశలే బాసలై  కలలు కనే పసి మనసులై కవితలు పాడీ  కవ్వించని కవ్వించని కవ్వించనీ

చరణం : 1 కళ్ళు కళ్ళు మూసుకున్నా హృదయంతో మాటాడునమ్మా ప్రేమా నిద్దుర చెదిరి పోయేనమ్మా నేస్తం కోసం వెతికేనమ్మా ప్రేమా ఆడించి పాడించి అనురాగం కురిపించీ  అలరించేదే ప్రేమా రమ్మంటే పొమ్మంటూ పొమ్మంటే రమ్మంటూ  కవ్వించేదే ప్రేమా ప్రేమలకు హద్దు లేదులే దాన్ని ఎవ్వరైన ఆపలేరులే నీ పిలుపే ప్రేమగీతం

చరణం : 2 జాతి లేదు మతము లేదు కట్నాలేవి కోరుకోదు ప్రేమా ఆది లేదు అంతం లేదు లోకం అంతా తానై ఉండును ప్రేమా ఊరేదో పేరేదో కన్నోళ్ళ ఊసేదో అడగదు నిన్ను ప్రేమా నాలోనా నీవుండి నీలోనా నేనుండి జీవించేదే ప్రేమా జాతకాలు చూడబోదులే ఎన్ని జన్మలైనా వీడిపోదులే నీ పిలుపే ప్రేమగీతం నీ పలుకే ప్రేమవేదం ఆశలే బాసలై కలలు కనే పసి మనసులై కవితలు పాడీ కవ్వించని కవ్వించని కవ్వించనీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి