9, మార్చి 2024, శనివారం

Prema Lekhalu : Nee Andam Nee Paruvam Song Lyrics (నీ అందం నీ పరువం నాలో దాచుకో)

చిత్రం: ప్రేమ లేఖలు (1977)

సాహిత్యం: మైలవరపు గోపి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం



పల్లవి:

నీ అందం నీ పరువం నాలో దాచుకో కాలం తెలియని బిగి కౌగిలిలో నన్నే దాచుకో ఓ  ఈ అందం ఈ పరువం నీకే అంకితం రేయి పగలు వెన్నెలా కాదా నీతో జీవితం

చరణం 1:

వీచే గాలి పూచే పూలు గుసగుసలాడాయి కోరికలన్నీ తీరేదెపుడని రెపరెపలాడాయి వీచే గాలి పూచే పూలు గుసగుసలాడాయి కోరికలన్నీ తీరేదెపుడని రెపరెపలాడాయి ఆ తొందర చూసి ఎగిరే గువ్వలు కిలకిల నవ్వాయి 

నీ అందం నీ పరువం నాలో దాచుకో కాలం తెలియని బిగి కౌగిలిలో నన్నే దాచుకో ఓ  ఈ అందం ఈ పరువం నీకే అంకితం రేయి పగలు వెన్నెలా కాదా నీతో జీవితం

చరణం 2: వలచిన నింగి ప్రేయసి కోసం వానై కురిసిందీ ఆ వానకు తడిసిన భూమి గుండెలో ఆవిరి ఎగిసిందీ వలచిన నింగి ప్రేయసి కోసం వానై కురిసిందీ ఆ వానకు తడిసిన భూమి గుండెలో ఆవిరి ఎగిసిందీ ఆ కలియికలోనే నింగి నేల జతగా మురిసేదీ 

నీ అందం నీ పరువం నాలో దాచుకో కాలం తెలియని బిగి కౌగిలిలో నన్నే దాచుకో ఓ  ఈ అందం ఈ పరువం నీకే అంకితం రేయి పగలు వెన్నెలా కాదా నీతో జీవితం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి