చిత్రం: ప్రేమ లేఖలు (1977)
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
పల్లవి:
నీ అందం నీ పరువం నాలో దాచుకో
కాలం తెలియని బిగి కౌగిలిలో నన్నే దాచుకో ఓ
ఈ అందం ఈ పరువం నీకే అంకితం
రేయి పగలు వెన్నెలా కాదా నీతో జీవితం
చరణం 1:
వీచే గాలి పూచే పూలు గుసగుసలాడాయి కోరికలన్నీ తీరేదెపుడని రెపరెపలాడాయి వీచే గాలి పూచే పూలు గుసగుసలాడాయి కోరికలన్నీ తీరేదెపుడని రెపరెపలాడాయి ఆ తొందర చూసి ఎగిరే గువ్వలు కిలకిల నవ్వాయి
నీ అందం నీ పరువం నాలో దాచుకో కాలం తెలియని బిగి కౌగిలిలో నన్నే దాచుకో ఓ ఈ అందం ఈ పరువం నీకే అంకితం రేయి పగలు వెన్నెలా కాదా నీతో జీవితం
చరణం 2: వలచిన నింగి ప్రేయసి కోసం వానై కురిసిందీ ఆ వానకు తడిసిన భూమి గుండెలో ఆవిరి ఎగిసిందీ వలచిన నింగి ప్రేయసి కోసం వానై కురిసిందీ ఆ వానకు తడిసిన భూమి గుండెలో ఆవిరి ఎగిసిందీ ఆ కలియికలోనే నింగి నేల జతగా మురిసేదీ
నీ అందం నీ పరువం నాలో దాచుకో కాలం తెలియని బిగి కౌగిలిలో నన్నే దాచుకో ఓ ఈ అందం ఈ పరువం నీకే అంకితం రేయి పగలు వెన్నెలా కాదా నీతో జీవితం