25, మార్చి 2024, సోమవారం

Samsaram Oka Chadarangam : Janaki Ramula Kalyananiki Song Lyrics (జానకి రాముల కల్యాణానికి )

చిత్రం: సంసారం ఒక చదరంగం(1987)

రచన: వేటూరి

గానం: పి. సుశీల

సంగీతం: చక్రవర్తి



పల్లవి  :

జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో

చరణం 1 :

కన్ను కన్ను కలవగనే ప్రణయం రాగం తీసెనులే పాదం పాదం కలపగనే హృదయం తాళం వేసెనులే ఒకటే మాట,ఒకటే బాణం ఒక పత్ని శ్రీరామ వ్రతం నాలో,నీలో రాగం తీసి వలపే పలకే త్యాగయ కీర్తనలెన్నో జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో

చరణం 2:

జానకి మేను తాకగనే జళ్ళున వీణలు పొంగినవి జాణకు పూతలు పూయగనే జావళి అందెలు మ్రోగినవి ప్రేమే సత్యం ప్రేమే నిత్యం ప్రేమే లేదా మయ్యమతం నాలో నీలో నాత్యాలాడి లయలే చిలికే రమదాసు కృతులెన్నో జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి