31, మార్చి 2024, ఆదివారం

Sri Anjaneyam : E Yogamanukonu Song Lyrics (ఏ యోగమనుకోను )

చిత్రం : శ్రీ ఆంజనేయం (2004)

సంగీతం : మణిశర్మ

రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



పల్లవి:

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే వజ్రదేహం భజేహం..భజేహం…భజేహం ఏ యోగమనుకోను నీతో వియోగం ఏ పుణ్యమనుకోను ఈ చేదు జ్ఞానం తపస్సనుకోలేదు నీతోటి స్నేహం మోక్షమనుకోలేను ఈ మహాశూన్యం నేలపై నిలపక నెయ్యమై నడపక చేరువై ఇంతగా చేయి విడిచేందుకా అరచేత కడదాక నిలుపుకోలేవంటూ నిజము తెలిపేందుకా గాలికొడుకా ఇలా చూపేవు వేడుక శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం చరణం : 1

రామనామము తప్ప వేరేమి వినపడని నీ చెవికెలా తాకే నా వెర్రికేక నీ భక్తి యోగముద్రను భంగపరిచేనా మట్టి ఒడిలోని ఈ గడ్డిపరక అమ్మ ఇచ్చిన నాటి నమ్మకము మెచ్చి అమృతపు నదిలాంటి కరుణలో ముంచి ఈత తెలియని నాతో ఆడుతున్నావా కోతి చేష్టలు చేసి నవ్వుతున్నావా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం చరణం : 2

కన్ను విడిచిన దృష్టి నిన్ను పోల్చేదేలా గొంతు విడిచిన కేక నిన్ను చేరేదెలా గుండె విడిచిన శ్వాస నిన్ను వెతికేదెలా నన్ను విడిచిన ఆశ నిన్ను పొందేదెలా బతుకోపలేనంత బరువైన వరమాల ఉరితాడుగా మెడను వాలి అణువంత నా ఉనికి అణిగేంతగా తలను నిమిరె హనుమంత నీజాలి నా చిన్ని బొమ్మవను భ్రమను చెరిపే తెలివి బ్రహ్మవని తెలిపి బలిచేస్తే ఎలాగయా నిలువునా నన్నిలా దహించే నీదయ నాకెందుకయ్యా ఓ ఆంజనేయా ఓ ఆంజనేయా ఓ ఆంజనేయా ఓ ఆంజనేయా ఓ ఆంజనేయా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి