Sri Anjaneyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sri Anjaneyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, మార్చి 2024, ఆదివారం

Sri Anjaneyam : Tikamaka Makatika Song Lyrics (తికమక మకతిక )

చిత్రం : శ్రీ ఆంజనేయం (2004)

సంగీతం : మణిశర్మ

రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



పల్లవి:

తికమక మకతిక పరుగులు ఎటుకేసి నడవరా నరవరా నలుగురితో కలిసి శ్రీ రామచందురుణ్ణి కోవెల్లో ఖైదుచేసి రాకాసి రావణున్ని గుండెల్లో కొలువు చేసి తలతిక్కల భక్తితో తైతక్కలా మనిషీ తై దిదితై దిదితై దిదితై- దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై- దిదితై దిదితై దిది తికమక మకతిక పరుగులు ఎటుకేసి నడవరా నరవరా నలుగురితో కలిసి చరణం : 1

వెతికే మజిలీ దొరికే దాకా కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా క్షణమైన నిన్నాపునా కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన బెదురంటు లేని మది ఎదురుతిరిగి అడిగేనా బదులంటూ లేని ప్రశ్నలేదు లోకాన నీ శోకమే శ్లోకమై పలికించరా మనిషీ…. తై దిదితై దిదితై దిదితై తికమక మకతిక పరుగులు ఎటుకేసి నడవరా నరవరా నలుగురితో కలిస చరణం : 2

అడివే అయినా కడలే అయినా ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసొంచి దారీయదా అటువంటి పాదాల పాదుకలకి పట్టాభిషేకమే కదా ఆ రామగాథ నువు రాసుకున్నదే కాదా… అది నేడు నీకు తగుదారి చూపనందా ఆ అడుగుల జాడలు చెరపొద్దురా మనిషీ…. తై దిది తరికిటతోం- తరికిటతోం తరికిటతోం తత్తోం తికామక తిక తికమక మకతిక పరుగులు ఎటుకేసి నడవరా నరవరా నలుగురితో కలిసి

Sri Anjaneyam : E Yogamanukonu Song Lyrics (ఏ యోగమనుకోను )

చిత్రం : శ్రీ ఆంజనేయం (2004)

సంగీతం : మణిశర్మ

రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



పల్లవి:

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే వజ్రదేహం భజేహం..భజేహం…భజేహం ఏ యోగమనుకోను నీతో వియోగం ఏ పుణ్యమనుకోను ఈ చేదు జ్ఞానం తపస్సనుకోలేదు నీతోటి స్నేహం మోక్షమనుకోలేను ఈ మహాశూన్యం నేలపై నిలపక నెయ్యమై నడపక చేరువై ఇంతగా చేయి విడిచేందుకా అరచేత కడదాక నిలుపుకోలేవంటూ నిజము తెలిపేందుకా గాలికొడుకా ఇలా చూపేవు వేడుక శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం చరణం : 1

రామనామము తప్ప వేరేమి వినపడని నీ చెవికెలా తాకే నా వెర్రికేక నీ భక్తి యోగముద్రను భంగపరిచేనా మట్టి ఒడిలోని ఈ గడ్డిపరక అమ్మ ఇచ్చిన నాటి నమ్మకము మెచ్చి అమృతపు నదిలాంటి కరుణలో ముంచి ఈత తెలియని నాతో ఆడుతున్నావా కోతి చేష్టలు చేసి నవ్వుతున్నావా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం చరణం : 2

కన్ను విడిచిన దృష్టి నిన్ను పోల్చేదేలా గొంతు విడిచిన కేక నిన్ను చేరేదెలా గుండె విడిచిన శ్వాస నిన్ను వెతికేదెలా నన్ను విడిచిన ఆశ నిన్ను పొందేదెలా బతుకోపలేనంత బరువైన వరమాల ఉరితాడుగా మెడను వాలి అణువంత నా ఉనికి అణిగేంతగా తలను నిమిరె హనుమంత నీజాలి నా చిన్ని బొమ్మవను భ్రమను చెరిపే తెలివి బ్రహ్మవని తెలిపి బలిచేస్తే ఎలాగయా నిలువునా నన్నిలా దహించే నీదయ నాకెందుకయ్యా ఓ ఆంజనేయా ఓ ఆంజనేయా ఓ ఆంజనేయా ఓ ఆంజనేయా ఓ ఆంజనేయా

Sri Anjaneyam : Rama Rama Raghurama Song Lyrics (రామ రామ రఘురామ)

చిత్రం : శ్రీ ఆంజనేయం (2004)

సంగీతం : మణిశర్మ

రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : మల్లికార్జున్



పల్లవి:

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా  అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా  సరదాగా నా గాలిపాట వినుమా  విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా  గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ  నిత్యం నీతో వున్నాగా ఇద్దరి లక్షణమొకటేగా.... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా   

చరణం 1:

అమ్మల్లె నను పెంచింది ఈ పల్లె సీమ  నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ  అమ్మల్లె నను పెంచింది ఈ పల్లె సీమ  నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ  ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా  ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం  అన్నీ సొంత ఇల్లే అంతా అయినవాళ్ళే  ఈ స్నేహబంధం నా పూర్వపుణ్యం  బతుకంతా ఇది తీరే ఋణమా..... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా    ఏ ఆటలాడిస్తావో ఓ కోతిబొమ్మా....  ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ  ప్రసన్నాంజనేయం అనే నామధేయం  ప్రతి మంచి కార్యం జరిపించు దైవం  ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం  నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం  నా వెంట నువ్వుంటే భయమా.... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా    సరదాగా నా గాలిపాట వినుమా  విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా  గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ  నిత్యం నీతో వున్నాగా ఇద్దరి లక్షణమొకటేగా...

Sri Anjaneyam : Ooregi Raavayya Song Lyrics (ఊరేగి రావయ్యా హనుమా జై హనుమా )

చిత్రం : శ్రీ ఆంజనేయం (2004)

సంగీతం : మణిశర్మ

రచయిత : వేటూరి

గానం : శంకర్ మహదేవన్



పల్లవి:

ఊరేగి రావయ్యా హనుమా జై హనుమా  ఊరేలి చూపించు మహిమ  మా తోడు నీవయ్యా హనుమా మా హనుమా  మా గోడు గోరంత వినుమా  వాయుపుత్రా హనుమా మావాడవయ్యా హనుమా  రామ భక్త హనుమా మా రక్ష నీవే వినుమా  మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ  చూపించరా దయ  మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా  వాయుపుత్రా హనుమా మావాడకొచ్చే హనుమా  రామ భక్త హనుమా మా రక్ష నీవే హనుమా  మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ  చూపించరా దయ  మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ  నీనీడ చాలునయా 

చరణం 1:

బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే  బాధలన్నీ తీర్చే దిక్కూ దైవం నీవేలే  చూసి రారా అంటేనే కాల్చి వచ్చావ్ మంటల్లే  జానకమ్మ కంట వెలిగే హారతీ నీవే  ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట  బ్రహ్మచారి  మా బ్రహ్మవంట  సరిపాటి ఎవరంట  సాహొ ... మాసామీ నువ్వే హామీ యిస్తూంటే  రామబాణాలు కాపాడేనంట  ఓహొ మా జండాపైన అండై నువ్వుంటే  రామరాజ్యాలు మావే లెమ్మంట  మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ  చూపించరా దయ  మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ  నీనీడ చాలునయా 

చరణం 2:

మండుతున్న సూర్యుణ్ణి పండులాగా మింగావు  లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు  తోక చిచ్చు వెలిగించి లంక గుట్టే రగిలించి  రావణుణ్ణి శిక్షించావు నువ్వే మాతోడు  శివతేజం నీ రూపమంట  పవమాన సుతుడంట  అంజనమ్మ ఆనందమంతా  హనిమా నీ చరితంట  పాహీ... శ్రీరామస్వామీ పల్లకి నువ్వంట  నీకు బోయీలు మేమే లెమ్మంటా  యాహీ .... ఆకాశాలైనా చాలని ఎత్తంట  కోటి చుక్కల్లు తల్లో పూలంటా  మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ  చూపించరా దయ  మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ  నీనీడ చాలునయా  వాయుపుత్రా హనుమా మా వాడవయ్యా హనుమా  రామభక్త హనుమా మా రక్ష నీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ  చూపించరా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా