చిత్రం : శ్రీ ఆంజనేయం (2004)
సంగీతం : మణిశర్మ
రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : మల్లికార్జున్
పల్లవి:
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
సరదాగా నా గాలిపాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా
గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ
నిత్యం నీతో వున్నాగా ఇద్దరి లక్షణమొకటేగా....
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
చరణం 1:
అమ్మల్లె నను పెంచింది ఈ పల్లె సీమ నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ అమ్మల్లె నను పెంచింది ఈ పల్లె సీమ నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్నీ సొంత ఇల్లే అంతా అయినవాళ్ళే ఈ స్నేహబంధం నా పూర్వపుణ్యం బతుకంతా ఇది తీరే ఋణమా..... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా ఏ ఆటలాడిస్తావో ఓ కోతిబొమ్మా.... ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అనే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంట నువ్వుంటే భయమా.... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలిపాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ నిత్యం నీతో వున్నాగా ఇద్దరి లక్షణమొకటేగా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి