చిత్రం : శ్రీ ఆంజనేయం (2004)
సంగీతం :మణిశర్మ
రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : శ్రేయ ఘోషల్
పల్లవి:
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని ఆ మూతిముడుపేంటలా ప్రేమంటే పామని బెదరాలా ధీమాగా తిరగర మగరాయడా భామంటే చూడని వ్రతమేలా పంతాలే చాలుర ప్రవరాఖ్యుడా మారనే మారవా మారమే మానవా మౌనివా మానువా తేల్చుకో మానవా
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని ఆ మూతిముడుపేంటలా
చరణం 1:
చెలితీగకి ఆధారమై బంధమై అల్లుకో దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో నా వాలు జడ చుట్టుకొని మొగిలిరేక నడుము నడిపించుకో వయసులో పరవశం చూపుగా చేసుకో సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని ఆ మూతిముడుపేంటలా
చరణం 2: ప్రతిముద్దుతో ఉదయించనీ కొత్త పున్నాగనై జతలీలలో అలసి మత్తెక్కిపోనీ నిద్రగన్నేరునై నీ గుండెపై ఒదిగుండనీ పొగడ పూదండనై నీ కంటి కోనేట కొలువుండిపోనీ చెలిమి చెంగలువనై మొజులే జాజులై పోయనీ హయిని తాపమే తుమ్మెదై తీయనీ తేనెని....
పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా తేనె మధురిమ చేదని ఆ మూతిముడుపేంటలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి