చిత్రం : శ్రీ ఆంజనేయం (2004)
సంగీతం : మణిశర్మ
రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : టిప్పు, శ్రేయ ఘోషల్
పల్లవి:
అవ్వాయి తువ్వాయీ అల్లాడే అమ్మాయీ
అవ్వాయి తువ్వాయీ ఖిలాడీ అబ్బాయీ
దాగీ దాగని సోకే బరువయీ ఆగీ ఆగని ఈడే ఇరుకయి
తాకీ తాకని చూపే చినుకయీ దూకీ దూకని ఊపే వరదైయి
ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో
అయ్యో రామా అసలిదేం లడాయీ
అవ్వాయి తువ్వాయీ అల్లాడే అమ్మాయీ
చరణం 1:
పాలోసి పెంచా ప్రతి భంగిమా
పోగేసి ఉంచా పురుషోత్తమా
అమాంతం తెగిస్తే సమస్తం తమకేగా
కంగారు పెట్టే సింగారమా
బంగారమంతా భద్రం సుమా
ప్రమాదం తెలిస్తే సరదాపడతావా
ఎన్నాళ్లీ గాలిలో తిరుగుడు
ఇలా నా ఒళ్లో స్థిరపడే దారి చూడు
బాలమణీ సరే కానీ మరి
పద చెల్లిస్తా ప్రతి బకాయీ
అవ్వాయి తువ్వాయీ ఖిలాడీ అబ్బాయీ
చరణం 2:
తెగ రెచ్చిపోకే పసి పిచ్చుకా నన్నాపలేదే నీ ఓపిక పిడుగై పడనా వ్రతమే చెడినాక చిర్రెత్తి వస్తే మగపుట్టుక సుకుమారమిస్తా సుఖపెట్టగా ఒడిలో పడనా వరమే అడిగాక కవ్వింతలెందుకే బాలికా మరీ పువ్వంటి సున్నితం కందిపోగా చిచ్చౌతావో నువ్వే చిత్తౌతావో ఎటూ తేలందే ఇదేం బడాయీ అవ్వాయి తువ్వాయీ ఖిలాడీ అబ్బాయీ దాగీ దాగని సోకే బరువయీ ఆగీ ఆగని ఈడే ఇరుకయి తాకీ తాకని చూపే చినుకయీ దూకీ దూకని ఊపే వరదైయి ఏం చేస్తుందో ఎలా ముంచేస్తుందో అయ్యో రామా అసలిదేం లడాయీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి