చిత్రం: ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య (2020)
రచన: విశ్వా
గానం: విజయ్ యేసుదాస్
సంగీతం: బిజిబాల్
పల్లవి :
నింగి చుట్టే మేఘం ఎరుగదా..
ఈ లోకం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో.. జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది
ఓసారి సగటుల కనికట్టు…
నింగి చుట్టే.. చిన్ని.. మేఘం యెరుగదా..
ఈ లోకం గుట్టు
మునిలా.. మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…
చరణం 1 :
తమదేదో తమదంటూ.. మితిమీర తగదంటూ..
తమదైన తృణమైన చాలను వరస…
ఉచితాన సలహాలు.. పగలేని కలహాలు..
ఎనలేని కధనాలు.. చోటిది బహుశా…
ఆరాటం తెలియని జంజాటం.. తమదిగా చీకు చింత..
తెలియదుగా…
సాగింది ఈ తీరు.. కథ సగటుల చుట్టూ..
నింగి చుట్టే.. మేఘం ఎరుగదా..ఈ లోకం గుట్టు..
మునిలా, మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో.. జోడి కట్టు..
చరణం 2 :
సిసలైన సరదాలు.. పడిలేచే పయనాలు.. తరిమేసి తిమిరాలు.. నడిచేలే మనస… విసుగేది దరిరాని.. విధిరాత కదిలేని.. శతకోటి సహనాల.. నడవడి తెలుసా… చిత్రంగ, కలివిడి సూత్రంగ.. కనపడే ప్రేమ పంతం తమ సిరిగా, సాగింది ఈ తీరు.. సగతుల కనికట్టు… నింగి చుట్టే.. చుట్టే.. మేఘం ఎరుగదా.. ఎరుగదా ఈ లోకం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు కాలం కదలికలతో.. జోడి కట్టు.. తొలిగా.. తారావాసాల ఊసుల్ని వీడి… చూసింది ఓసారి సగటుల కనికట్టు…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి