చిత్రం: వారసుడు (1993)
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి:
ఒ..ఒ..ఒ.. ఓరియా ఒ..ఒ..ఒ.. ఓరియా సిలకలాగా కులుకుతుంటే సిలుకు చీరా రైకా కొనిపెడతాలే గొడవమాని కుదురుగుంటే మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా సిలకలాగా కులుకుతుంటే సిలుకు చీరా రైకా కొనిపెడతాలే గొడవమాని కుదురుగుంటే మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే చరణం: 1
పాపా పాపా పైరగాలిలో పైటలాగా చుట్టుకోనా బావా బావా వంగతోటలో ఒడుపు చూపితే ఒప్పుకోనా మాయమాటలింక చాలు పోకిరి ఇటు రా మరి కాక మీద ఉంది పిల్ల డింగరి చూసై గురి కరగదీయనా... అరగదీయనా... చిక్కావులే ఎడాపెడా చిన్నారి ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా.. ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య.. ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా సిలకలాగా కులుకుతుంటే సిలుకు చీరా రైకా కొనిపెడతాలే గొడవమాని కుదురుగుంటే మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే చరణం: 2
ఉంగా ఉంగా ఓరి నాయనో.. ఓపలేనురోయ్ వన్నెకాడా వయ్యారంగా అస్కుబుస్కులు మొదలు పెట్టనా మంచెకాడా తీపి తిక్క రేగుతోంది పిల్లడా నీ జిమ్మడ సోకు వెచ్చ బెట్టుకుంటే పోతదే పద గుమ్మడి దొరికినానని కొరకమాకురో సందిట్లో చెడమడా బావయ్యో ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా.. ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య.. ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా సిలకలాగా..ఓయ్.. కులుకుతుంటే..ఓయ్.. సిలుకు చీరా రైకా కొనిపెడతాలే గొడవమాని..ఓయ్.. కుదురుగుంటే..ఓయ్.. మిరిపచేల్లో నీకో ముద్దెడతాలే ఓ..ఓరియా.. ఓ.. ఓ.. ఓరియా ఇచ్చే కమ్మగా గుమ్ముగా ఓరియా ఓ.. బావయ్య.. ఓ..ఓ.. బావయ్య ఇస్తాలేవయ్య.. రావయ్య ఓరియా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి