చిత్రం: చంద్రముఖి (2005)
రచన : సుద్దాల అశోక్ తేజ
సంగీతం : విద్యాసాగర్
గానం : టిప్పు, రాజేశ్వరి, మాణిక్క వినాయకం & గంగ
పల్లవి :
చిలుకా పదపద… నెమలి పదపద
మైనా పదపద… మనసా పద
చిలుకా పదపద… నెమలి పదపద
మైనా పదపద… మనసా పదా
గాలి పటమా పదపద పదా… హంసలాగా పదపద
ఆకాశమే మరి మనకిక… హద్దు కాదు పద పద
పైకి పోయే పతమే… ఇది పందెం గెలిచే పతమే
సూపర్ స్టారు పవరే పతంగం
పైకి పోయే పతమే… ఇది పందెం గెలిచే పతమే
సూపర్ స్టారు పవరే పతంగం
చిలుకా పదపద… నెమలి పదపద
మైనా పదపద… మనసా పదా
చరణం : 1
మీనాక్షి అమ్మను ప్రార్ధించి
నువ్వు లేని వాళ్ళ కోసమింక పైకమివ్వు
కైలాస నాధుని పూజించి
తెలుగునేల తల్లి కోరుకున్న గంగనివ్వు
నీకు ఎదురు లేనేలేదు నిండు చందమామలాగా
ఇష్టం వచ్చినట్టు పైకి పోయింకా
గాలి ఇప్పుడెమో మనకు… వీలుగానే వీస్తూ ఉంది
రెక్క విప్పి నింగిని దాటి పోవమ్మా
కట్టాను బ్లేడు వంటి మాంజా… నీకింకా లేదు భయమే
పైకి పోయే పతమే… ఇది పందెం గెలిచే పతమే
సూపర్ స్టారు పవరే పతంగం
పైకి పోయే పతమే… ఇది పందెం గెలిచే పతమే
సూపర్ స్టారు పవరే పతంగం
చిలుకా పదపద… నెమలి పదపద
మైనా పదపద… మనసా పదా
చరణం : 2
నింగి అంచున పైన తేలే నిన్ను
ఎగరవేసే వారి చెయ్యి తల్చుకోవే
చుక్కల్లోనా చుక్కవైనా నీకు
ఆధారంగా దారం ఉంది రెచ్చిపోవే
మాయ లేదు మంత్రం లేదు… వేదాలేవి చదవాలేదు
మోక్షం బాట తెలిసే గాలి పటమా
పూజలేవి చెయ్యకున్నా నోచుకోని పుట్టినావే
యోగమెవరు నేర్పినారు నీకు
గుండెల్లో ఆశపుట్టి నీకే చూపిందా మనసు మార్గమే
చిలుకా పదపద… నెమలి పదపద
మైనా పదపద… మనసా పదా
గాలి పటమా పదపద పదా… హంసలాగా పదపద
ఆకాశమే మరి మనకిక… హద్దు కాదు పద పద
పైకి పోయే పతమే… ఇది పందెం గెలిచే పతమే
సూపర్ స్టారు పవరే పతంగం
పైకి పోయే పతమే… ఇది పందెం గెలిచే పతమే
సూపర్ స్టారు పవరే పతంగం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి