3, ఏప్రిల్ 2024, బుధవారం

Chandramukhi : Kontha Kalam Song Lyrics (కొంత కాలం కొంత కాలం )

చిత్రం: చంద్రముఖి (2005)

రచన : వెన్నలకంటి

సంగీతం : విద్యాసాగర్

గానం : మధు బాలకృష్ణన్, సుజాత మోహన్



పల్లవి :

కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి ఎంత కాలంమెంత కాలం హద్దు మీరకుండాలి అంత కాలమంత కాలం ఈడు నిద్దరాపాలి కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి చరణం : 1

గుండె విరహములో మండే వేసవిలో నువ్వే శీతకాలం కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం మదనుడికి పిలుపు మల్లె కాలం మదిలోనె నిలుపు ఎల్లకాలం చెలరేగు వలపు చెలి కాలం కలనైన తెలుపు కలకాలం తొలి గిలి కాలం కౌగిలికాలం మన కాలం ఇది... ఆ... కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి చరణం : 2

కన్నె మోజులకు సన్నజాజులకు కరిగే జాము కాలం గుచ్చే చూపులకు గిచ్చే కైపులకు వచ్చే ప్రేమకాలం తమి తీరకుండు తడి కాలం క్షణమాగనంది ఒడి కాలం కడిగింది సిగ్గు తొలికాలం మరిగింది మనసు మలి కాలం మరి సిరికాలం మగసొరి కాలం మన కాలం పదా... ఆ... కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి నిన్న కాలం మొన్న కాలం రేపు కూడ రావాలి ఎంత కాలంమెంత కాలం హద్దు మీరకుండాలి అంత కాలమంత కాలం ఈడు నిద్దరాపాలి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి