11, నవంబర్ 2024, సోమవారం

Hi Nanna : Chedhu Nijam Song Lyrics (ఓ ఓ చేదు నిజం)

చిత్రం : హాయ్ నాన్నా (2023)

సంగీతం : హేషామ్ అబ్దుల్ వహాబ్

రచన : కృష్ణకాంత్

గానం: గీతా మాధురి, వినీత్ శ్రీనివాసన్




పల్లవి:

స్వప్నాలన్ని కళ్ళ ముందే కరిగెనిలా అయినా ఏదో ఆశే నీదిగా ఏవైందో ఈ ప్రేమ పుట్టె ఒక్కసారిగా ఎందుకంటె చెప్పలేవుగా ఏదేదో ఊహించావ ప్రాణంగా ప్రేమించావ హ ఏ ఏ, గుండె పట్టి లాగే గుండె పట్టి లాగే ఏనాడు చూడంది ఈ బాధే ఓ ఓ చేదు నిజం, వెంటాడే గతం మన కలలని దూరమె చేసెను చేసెను చేదు నిజం గాయాల గతం మన ప్రేమని దూరమె చేసెనుగా మనసా కుదుటపడె మనసా సగము కథలా మిగిలి నిలిచా ముగిసే ముందు ఖాళీ ఇదా ఓ ఓ చేదు నిజం, వెంటాడే గతం మన కలలని దూరమె చేసెను చేసెను చేదు నిజం గాయాల గతం మన ప్రేమని దూరమె చేసెనుగా

చరణం-1: ఏవి కావు నిన్నొద్దన్నా వదలవుగా అన్నీ మించే ప్రేమే నీదిగా నీ ఊహ మేడల్లో నీకే చోటు లేదుగా లోకం మొత్తం చిన్నదాయెగా నేనేదో ఊహించాన, మీతోనే ఉండి లేనా హ ఏ ఏ, ఏమి కాను మీకే ఏమి కాను మీకే అంటారే ప్రాణాలే పోతుంటే ఏ ఏ కోపమిదో, ఏ శాపమిదో మన మనసుని శూన్యమే చేసినదో తన ఆట ఇదో, లేకుంటె విధో మరి కంచికి చేరని గాధ ఇదో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి