చిత్రం : హాయ్ నాన్నా (2023)
సంగీతం : హేషామ్ అబ్దుల్ వహాబ్
రచన : అనంత శ్రీరామ్
గానం: అనురాగ్ కులకర్ణి & సితార కృష్ణకుమార్
పల్లవి:
సమయమా…
భలే సాయం చేశావమ్మా ఒట్టుగా… ఒట్టుగా
కనులకే తన రూపానందిచావే గుట్టుగా
ఓ ఇది సరిపోదా
సరి సరి తోరపడకో
తదుపరి కథ ఎటుకో
ఎటు మరి తన నడకో
చివరికి ఎవరేనకో
సమయమా…
భలే సాయం చేశావమ్మా ఒట్టుగా… ఒట్టుగా
కనులకే తన రూపానందిచావే గుట్టుగా
ఓ తను ఎవరే
నడిచే దారా తళుకులా ధారా
తను చూస్తుంటే రాదే నిద్దుర
పలికే ఏరా కునుకే ఔరా
అలలే పొంగే అందం అది తనపెరా
చరణం-1:
ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళo భూగోళ్ళనే తిప్పేసే ఆ బుంగ మూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చెంపల్లో చెంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తుఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం చాయా చిత్రం అయినదే సరి సరి తోరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరేనకో సమయమా… భలే సాయం చేశావమ్మా ఒట్టుగా… ఒట్టుగా కనులకే తన రూపానందిచావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సమయమా…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి