చిత్రం : S.R.కళ్యాణ మండపం(2021)
సంగీతం : చైతన్ భరద్వాజ్
రచన : భాస్కర భట్ల
గానం: హరిచరణ్, చైతన్ భరద్వాజ్
పల్లవి:
గుండెసడిలాగ నీలో నన్నే దాచావా
కంటి వెలుగు నాన్నే అనుకున్నావా
మహరాజల్లే మళ్ళీ చూడాలనుకుంటు సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నావా
నన్నింత ప్రాణంగా కొలిచిన నిన్ను
దూరంగా తోస్తూ నిందించానా
అరరే ఇపుడే ఇపుడే తెలిసినదే
మనసే పొలమారిందే
కనుకే కనుకే కనుపాపే
నిన్నే నిన్నే చూడాలందే
చరణం-1:
ఎదిగి ఎదిగి ఎగిరిపోయావని
పొరపాటుగా అనుకున్నానే
వెనకి వెనకే తిరుగుతున్నావని ఆలస్యంగా గుర్తించానే
నీ లాంటి కొడుకు ఉన్నంత వరకు
ఏ ఇంటి పరువు చేజారిపోదే
నువ్ చేసే పనులు
నువు కన్న కలలు నాకోసమే అంటే
కనులకి తడి తగిలెను కదా
ఇపుడే ఇపుడే తెలిసినదే
మనసే పొలమారిందే
కనుకే కనుకే కనుపాపే
నిన్నే నిన్నే చూడాలందే
చరణం-2:
తలలు నిమిరే మొదటి స్నేహం నువ్వే
నిన్నే ఎలా మరచిపోతా
భుజము తడిమే మొదటి ధైర్యం నువ్వే
నిన్నే ఎలా విడిచిపోతా
నీ గోరుముద్ద నీ చేతి స్పర్శ
నాకన్నీ గుర్తే ఓ పిచ్చి నాన్న
నువ్వే నాలోకం నువ్వే నా సర్వం
నువ్విచ్చిన ప్రాణం అడుగడుగున గుడి కడతది
ఇపుడే ఇపుడే తెలిసినదే
మనసే పొలమారిందే
కనుకే కనుకే కనుపాపే
నిన్నే నిన్నే చూడాలందే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి