SR Kalyanamandapam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
SR Kalyanamandapam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, నవంబర్ 2024, ఆదివారం

SR Kalyanamandapam : Sigguendukura Mama Song Lyrics (తిట్టిన బాగుంటాదే )

చిత్రం : S.R.కళ్యాణ మండపం(2021)

సంగీతం : చైతన్ భరద్వాజ్

రచన : భాస్కరభట్ల రవి కుమార్

గానం: అనురాగ్ కులకర్ణి



పల్లవి:

తిట్టిన బాగుంటాదే కొట్టిన బాగుంటాదే గర్ల్ ఫ్రెండ్ ఏంచేసినా గారాబంగా ఉంటాదే ఛి అన్న నచ్చేస్తాదే తూ అన్న నచ్చేస్తాదే పాపతో పంచాయితీ గమ్మత్తుగా ఉంటాదే నిజమేరా మామ గుండెలో హాయ్ హాయ్ జాతర్లే అంతేరా మామ జిందగీలో రంగు గాలిపటాలే విన్నావా మామ తుళ్ళి తుళ్ళి ఆడే ప్రాణాలే దిల్ మే ధక్ ధక్ సుప్పనాతి సూపులకు సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు మడిసి జేబులో పెట్టు వాళ్ళు ఎమన్నా కానీ శబాష్ అని సీటీ కొట్టు

చరణం-1:

హే నచ్చక నచ్చక పిల్లే నచ్చుతాదే పని పాట మానేసి ఎన్నో ఏళ్ళు తిరిగితే దొరికిన ప్రసాదం కళ్ళకు అద్దుకోవాలి కానీ లేని పోనీ వంకే పెట్టి వదిలేసుకుంటామా అయినా ఆ.. బుర్రోనోడు ఆ.. బుద్దున్నోడు ఆ.. దుమ్మెత్తి పోస్తే దులిపేసుకుంటాడు వంద కాదు వెయ్యి చెప్పు ఒప్పుకోదు పూల కొప్పు దండయాత్ర వాళ్ల హక్కు లోగిపోడం ఒకటే దిక్కు సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు మడిసి జేబులో పెట్టు వాళ్ళు ఎమన్నా కానీ శబాష్ అని సీటీ కొట్టు

చరణం-2:

ఆ.. నవ్వితే ముత్యాలే ఏరుకొని పోతామని చిర్రుబుర్రులాడుతూ దాచేస్తారు నవ్వుని ఓకే చెప్పేస్తే అలుసే అవుతామని చచ్చిన చెప్పరు వీళ్ళు చాలా ముదుర్లే అయినా ఆ లెక్కల్నే ఆ స్కెచుల్నే ఆ.. కనిపెట్టాలంటే కాదె మావల్ల ఆడపిల్ల అందం చందం అయ్యబాబోయ్ అయస్కాంతం మనమేమో ఇనపముక్క అతుక్కుపోదాం అది లెక్కా సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు మడిసి జేబులో పెట్టు వాళ్ళు ఎమన్నా కానీ శబాష్ అని సీటీ కొట్టు

SR Kalyanamandapam : Gundesadilaga Song Lyrics (గుండెసడిలాగ నీలో)

చిత్రం : S.R.కళ్యాణ మండపం(2021)

సంగీతం : చైతన్ భరద్వాజ్

రచన : భాస్కర భట్ల

గానం: హరిచరణ్, చైతన్ భరద్వాజ్




పల్లవి:

గుండెసడిలాగ నీలో నన్నే దాచావా 

కంటి వెలుగు నాన్నే అనుకున్నావా 

మహరాజల్లే మళ్ళీ చూడాలనుకుంటు సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నావా

నన్నింత ప్రాణంగా కొలిచిన నిన్ను

దూరంగా తోస్తూ నిందించానా 

అరరే ఇపుడే ఇపుడే తెలిసినదే 

మనసే పొలమారిందే 

కనుకే కనుకే కనుపాపే 

నిన్నే నిన్నే చూడాలందే

చరణం-1:

ఎదిగి ఎదిగి ఎగిరిపోయావని 

పొరపాటుగా అనుకున్నానే 

వెనకి వెనకే తిరుగుతున్నావని ఆలస్యంగా గుర్తించానే

నీ లాంటి కొడుకు ఉన్నంత వరకు 

ఏ ఇంటి పరువు చేజారిపోదే

నువ్ చేసే పనులు 

నువు కన్న కలలు నాకోసమే అంటే 

కనులకి తడి తగిలెను కదా


ఇపుడే ఇపుడే తెలిసినదే 

మనసే పొలమారిందే 

కనుకే కనుకే కనుపాపే 

నిన్నే నిన్నే చూడాలందే

చరణం-2:

తలలు నిమిరే మొదటి స్నేహం నువ్వే 

నిన్నే ఎలా మరచిపోతా 

భుజము తడిమే మొదటి ధైర్యం నువ్వే  

నిన్నే ఎలా విడిచిపోతా 

నీ గోరుముద్ద నీ చేతి స్పర్శ 

నాకన్నీ గుర్తే ఓ పిచ్చి నాన్న 

నువ్వే నాలోకం నువ్వే నా సర్వం

నువ్విచ్చిన ప్రాణం అడుగడుగున గుడి కడతది 


ఇపుడే ఇపుడే తెలిసినదే

మనసే పొలమారిందే 

కనుకే కనుకే కనుపాపే 

నిన్నే నిన్నే చూడాలందే

SR Kalyanamandapam : Choosale Kallaraa Song Lyrics (చూశాలే కళ్ళారా…)

చిత్రం : S.R.కళ్యాణ మండపం(2021)

సంగీతం : చైతన్ భరద్వాజ్

రచన : కృష్ణకాంత్

గానం: సిద్ శ్రీరామ్



పల్లవి:

ఈ నేల తడబడే… వరాల వరవడే
ప్రియంగా మొదటిసారి… పిలిచే ప్రేయసే
అదేదో అలజడే, క్షణంలో కనబడే… గతాలు వదిలి పారిపోయే చీకటే
తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే అలిసెనా, ఎదురై ఇపుడే దొరికెనా
ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే తెలిసేలా
చెలియే పిలిచేనా…
చూశాలే కళ్ళారా…
వెలుతురువానే నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే…
నీ తొలకరి చూపే… నా అలజడినాపే
నా ప్రతిదిక నీకే… ఇక పోను పోను దారే మారేనా

చరణం-1:

నా శత్రు వీ నడుమే… చంపదా తరిమే
నా చేతులే తడిమే… గుండెల్లో భూకంపాలేనా
నా రాతే నీవే మార్చేశావే… నా జోడి నీవేలే
చూశాలే కళ్ళారా…
వెలుతురువానే నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే…
నీ జత కుదిరాకే… నా కదలిక మారే
నా వధువిక నీవే… ఆ నక్షత్రాల దారి నా పైనా

చరణం-2:

హే తాళాలు తీశాయి కాలాలే… కౌగిళ్ళలో చేరాలిలే
తాళేమో వేచుంది చూడే… నీ మెళ్ళో చోటడిగే
హే ఇబ్బంది అంటోంది గాలే… దూరేందుకే మా మధ్యనే
అల్లేసుకున్నాయి ప్రాణాలే… ఇష్టంగా ఈనాడే
తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే అలిసేనా
ఎదురై ఇపుడే దొరికేనా…
ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే తెలిసేలా
చెలియా పిలిచేనా…
చూశాలే కళ్ళారా…
వెలుతురువానే నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే…
నీ జత కుదిరాకే… నా కదలిక మారే
నా వధువిక నీవే… ఆ నక్షత్రాల దారి నా పైనా

27, జులై 2021, మంగళవారం

SR Kalyanamandapam : Chukkala Chunni Lyrics (హే చుక్కల చున్నీకే)

చిత్రం : S.R.కళ్యాణ మండపం(2021)

సంగీతం : చైతన్ భరద్వాజ్

రచన : భాస్కరభట్ల రవి కుమార్

గానం: అనురాగ్ కులకర్ణి



పల్లవి:

హే చుక్కల చున్నీకే నా గుండెను కట్టావే ఆ నీలాకాశంలో గిర్రా గిర్రా తిప్పేసావే మువ్వల పట్టీకే నా ప్రాణం చుట్టావే నువ్వెళ్ళే దారంతా… అరె గళ్ళు గళ్ళు మోగించావే వెచ్చా వెచ్చా ఊపిరితోటి… ఉక్కిరి బిక్కిరి చేశావే ఉండిపో ఉండిపో ఉండిపో నాతోనే హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా

చరణం-1:

కొత్త కొత్త చిత్రాలన్నీ ఇప్పుడే చూస్తున్నాను గుట్టుగా దాచుకోలేను డప్పే కొట్టి చెప్పాలేను పట్టలేని ఆనందాన్ని ఒక్కడినే మొయ్యలేను కొద్దిగా సాయం వస్తే పంచుకుందాం నువ్వు నేను కాసేపు నువ్వు కన్నార్పకు నిన్నులో నన్ను చూస్తూనే ఉంటా కాసేపు నువ్వు మాటాడకు కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా ఓ ఎడారిలా ఉండే నాలో సింధూ నదై పొంగావే ఉండిపో ఉండిపో ఉండిపో నాతోనే హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా

చరణం-2:

బాధనే భరించడం అందులోంచి బయటికి రాడం చాలా చాలా కష్టం అని ఏంటో అంతా అంటుంటారు వాళ్లకి తెలుసో లేదో హాయిని భరించడం అంతకన్న కష్టం కదా అందుకు నేనే సాక్ష్యం కదా ఇంతలా నేను నవ్వింది లేదు ఇంతలా నన్ను పారేసుకోలేదు ఇంతలా నీ జుంకాలాగా మనసేనాడు ఊగలేదు హే దాయి దాయి అంటూ ఉంటే చందమామై వచ్చావే ఉండిపో ఉండిపో ఉండిపో తోడుగా నాతోనే హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే పిచ్చోడిలా తయారయ్యా హొయ్యారే హొయ్యారే హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే నాలో నేనే గల్లంతయ్యా