10, నవంబర్ 2024, ఆదివారం

SR Kalyanamandapam : Sigguendukura Mama Song Lyrics (తిట్టిన బాగుంటాదే )

చిత్రం : S.R.కళ్యాణ మండపం(2021)

సంగీతం : చైతన్ భరద్వాజ్

రచన : భాస్కరభట్ల రవి కుమార్

గానం: అనురాగ్ కులకర్ణి



పల్లవి:

తిట్టిన బాగుంటాదే కొట్టిన బాగుంటాదే గర్ల్ ఫ్రెండ్ ఏంచేసినా గారాబంగా ఉంటాదే ఛి అన్న నచ్చేస్తాదే తూ అన్న నచ్చేస్తాదే పాపతో పంచాయితీ గమ్మత్తుగా ఉంటాదే నిజమేరా మామ గుండెలో హాయ్ హాయ్ జాతర్లే అంతేరా మామ జిందగీలో రంగు గాలిపటాలే విన్నావా మామ తుళ్ళి తుళ్ళి ఆడే ప్రాణాలే దిల్ మే ధక్ ధక్ సుప్పనాతి సూపులకు సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు మడిసి జేబులో పెట్టు వాళ్ళు ఎమన్నా కానీ శబాష్ అని సీటీ కొట్టు

చరణం-1:

హే నచ్చక నచ్చక పిల్లే నచ్చుతాదే పని పాట మానేసి ఎన్నో ఏళ్ళు తిరిగితే దొరికిన ప్రసాదం కళ్ళకు అద్దుకోవాలి కానీ లేని పోనీ వంకే పెట్టి వదిలేసుకుంటామా అయినా ఆ.. బుర్రోనోడు ఆ.. బుద్దున్నోడు ఆ.. దుమ్మెత్తి పోస్తే దులిపేసుకుంటాడు వంద కాదు వెయ్యి చెప్పు ఒప్పుకోదు పూల కొప్పు దండయాత్ర వాళ్ల హక్కు లోగిపోడం ఒకటే దిక్కు సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు మడిసి జేబులో పెట్టు వాళ్ళు ఎమన్నా కానీ శబాష్ అని సీటీ కొట్టు

చరణం-2:

ఆ.. నవ్వితే ముత్యాలే ఏరుకొని పోతామని చిర్రుబుర్రులాడుతూ దాచేస్తారు నవ్వుని ఓకే చెప్పేస్తే అలుసే అవుతామని చచ్చిన చెప్పరు వీళ్ళు చాలా ముదుర్లే అయినా ఆ లెక్కల్నే ఆ స్కెచుల్నే ఆ.. కనిపెట్టాలంటే కాదె మావల్ల ఆడపిల్ల అందం చందం అయ్యబాబోయ్ అయస్కాంతం మనమేమో ఇనపముక్క అతుక్కుపోదాం అది లెక్కా సిగ్గేందుకురా మామ వొద్దే వద్దు మడిసి జేబులో పెట్టు వాళ్ళు ఎమన్నా కానీ శబాష్ అని సీటీ కొట్టు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి