27, డిసెంబర్ 2024, శుక్రవారం

Aalapana : Aavesamanta aalaapaneley Song Lyrics (ఆవేశమంతా ఆలాపనేలే)

చిత్రం : ఆలాపన (1986)

సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి


పల్లవి :

ఆవేశమంతా ఆలాపనేలే..ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే..ఉదయినిగా... 
నాలో జ్వలించే వర్ణాల రచన.. 
నాలో జలించే స్వరాలా.. 
ఆవేశమంతా ఆలాపనేలే..

చరణం:1

అలపైటలేసే.. సెలపాట విన్న.. 
గిరివీణమీటే జలపాతమన్న 
నాలోన సాగే ఆలాపన.. 
రాగాలుతీసే ఆలోచన ..
జర్ధరతల నాట్యం  
అరవిరుల మరుల కావ్యం..
ఎగసి ఎగసి నాలో గళ మధువులడిగె గానం 
నిదురలేచె నాలొ హౄదయమే.. 
ఆవేశమంతా ఆలాపనేలే..ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే... 

చరణం:2

వలకన్యలాడే తొలిమాసమన్నా.. 
గోధూళి తెరలొ మలిసంజె కన్నా  
అందాలు కరిగె ఆవేదన..
నాదాల గుడిలో ఆరాధన..
చిలిపి చినుకు చందం.. 
పురివిడిన నెమలి పింఛం  
ఎదలు కదిపి నాలొ.. 
విరిపొదలు వెతికె మోహం 
బదులు లేని ఎదో పిలుపులా 


ఆవేశమంతా ఆలాపనేలే..ఎదలయలో... 
నాలో జ్వలించే వర్ణాల రచన.. 
నాలో జలించే స్వరాలా..  
ఆవేశమంతా ఆలాపనేలే..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి