27, డిసెంబర్ 2024, శుక్రవారం

Gorantha Deepam : Raayinaina Kaakapotini Song Lyrics (రాయినైన కాకపోతిని)

చిత్రం : గోరంత దీపం (1978)

సంగీతం : కె.వి.మహదేవన్ సాహిత్యం : ఆరుద్ర గానం: పి.సుశీల


పల్లవి :

రాయినైన కాకపోతిని రామపాదము శోకగ.. 
బోయనైన కాకపోతిని పుణ్యచరితము పాడగ.. 
కడవనైన కాకపోతిని స్వామికార్యము తీర్చగ.. 
పాదుకైన కాకపోతిని భక్తిరాజ్యమునేలగ..

చరణం:1

అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా.. 
అందువలనా రామచంద్రుని అమిత కరుణను నోచనా..
కడలి గట్టున ఉడతనైతే బుడత సాయము చేయన.. 
కాలమెల్ల రామభద్రుని నీలిగురుతులు మోయన  
రాయినైన కాకపోతిని రామపాదము శోకగ.. 
బోయనైన కాకపోతిని పుణ్యచరితము పాడగ.. 

చరణం:2

కాకినైన కాకపోతిని ఘాతుకమ్మును చేయుచూ.. 
గడ్డీ పోచను శరముచెసి ఘనత రాముడు చూపగ..
మహిని అల్పజీవులే ఈ మహిమలన్ని నోచగ.. 
మనిషినై జన్మించినాను మత్సరమ్ములు రేపగ.. 
మదమత్సరమ్ములు రేపగ...
రాయినైన కాకపోతిని రామపాదము శోకగ.. 
బోయనైన కాకపోతిని పుణ్యచరితము పాడగ.. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి