22, డిసెంబర్ 2024, ఆదివారం

Arya : FeelMyLove Song Lyrics (నా ప్రేమను కోపంగానో)

చిత్రం: ఆర్య(2004)

రచన: చంద్రబోస్

గానం: కె.కె

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి :

నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్ నా ప్రేమను మౌనంగానో నా ప్రేమను హీనంగానో నా ప్రేమను శూన్యంగానో కాదో లేదో ఏదో గాథో నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్

చరణం: 1 : 

నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ ఫీల్ మై లవ్ నే పంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్ నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతూ ఫీల్ మై లవ్ నా చిలిపి చేష్టలకే విసుగొస్తే ఫీల్ మై లవ్ నా ఉనికే నచ్చదంటూ నా ఊహే రాదనీ నేనంటే గిట్టదంటూ నా మాటే చేదని నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే ఫీల్ మై లవ్....ఫీల్ మై లవ్ నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్

చరణం: 2 : 

ఎరుపెక్కీ చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్ ఏదోటీ తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్ విదిలించీ కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్ వదిలేసి వెలుతూనే అడుగారా ఫీల్ మై లవ్ అడుగులకే అలసటొస్తే చేతికి శ్రమ పెరిగితే కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే ఆపైనా ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే ఫీల్ మై లవ్....ఫీల్ మై లవ్  నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో నా ప్రేమను శాపంగానో చెలియా ఫీల్ మై లవ్ నా ప్రేమను భారంగానో నా ప్రేమను దూరంగానో నా ప్రేమను నేరంగానో సఖియా ఫీల్ మై లవ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి