చిత్రం: అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
పల్లవి :
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
చరణం:1
సందిట్లో పడి కాగే కాముడు గోల పెట్టగా
పూలే ఈల కొట్టగా కన్నెపిట్టకే కన్ను కొట్టుకోనా
ఓ.ఓ. అందిట్లో పడి వెన్నెట్లో పడుచందమిచ్చుకోనా
ముచ్చట్లో ముడి ముద్దుల్లో తడి మేను దాచుకోనా
మంచుల్లో ఊరేసాను మల్లెపూలు
మంచంలో ఆరేస్తాను కన్నె పూలు
కొంగుల్లో దాచుంచాను కొత్త పూలు
కొత్తల్లో మొగ్గేసేవే సిగ్గు పూలు
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
చరణం:2
ఊపుల్లో పడి రేగే సొంపులు ఊగుతున్నవి
నాలో ఆగకున్నవి జాజి తీగలా నిన్ను అల్లుకోనా
ఓ.ఓ.ఓ. చూపుల్లో సడి చేతల్లో పడి తప్పు చేసుకోనా
రాజీలే పడి సాగే దోపిడి నేను ఒప్పుకోనా
తాళాలే దాటించాలి తందనాలు
ఓ... తాపాలే తగ్గించాలి చందనాలు
ఓ... ఇంతట్లో రగిలాయంటే ఇంధనాలు
ఓ... వాటేసి చేసేస్తాలే వందనాలు
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి