31, డిసెంబర్ 2024, మంగళవారం

Rakshakudu : Chanduruni Takinadi Song Lyrics (చందురుని తాకినది)

చిత్రం: రక్షకుడు (1997)

సాహిత్యం: భువన చంద్ర

గానం: హరిహరన్, సుజాత మోహన్

సంగీతం: ఏ ఆర్ రెహమాన్


పల్లవి :

చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా (2) అరె ఆర్మ్‌స్ట్రాంగా... చెక్కిలిని దోచినది నేనేగా... అరె నేనేగా కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం (2)॥ చందురుని తాకినది నీవేగా... అరె నీవేగా వెన్నెలని దోచినది నీవేగా... అరె నీవేగా వయసు వాకిలిని తెరిచె వయ్యారం నీ కలల మందారం శ్రుతిలయల శృంగారం

చరణం : 1

పూవులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే (2) పైటచాటు పున్నమిలా పొంగే మధురిమలే తలపుల వెల్లువలో తలగడ అదుముకున్నా తనువుని పొదువుకొని ప్రియునే కలుసుకున్నా తాపాల పందిరిలో దీపమల్లె వెలుగుతున్నా మగసిరి పిలుపులతో తేనెలాగ మారుతున్నా కోరికల కోవెలలో కర్పూరమౌతున్నా॥

చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా (2) అరె ఆర్మ్‌స్ట్రాంగా... చెక్కిలిని దోచినది నేనేగా... అరె నేనేగా కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం (2)॥ చందురుని తాకినది

చరణం : 2

రమ్మనే పిలుపు విని రేగుతోంది యవ్వనమే ఏకమై పోదామంటూ జల్లుతోంది చందనమే నీటిలోని చేపపిల్ల నీటికి భారమౌనా కోరుకున్న ప్రియసఖుడు కౌగిలికి భారమౌనా చెంతచేర వచ్చినానే చేయిజారిపోకే పిల్లా పిల్లగాడి అల్లరిని ఓపలేదు కన్నెపిల్ల అలిగిన మగతనమే పగబడితే వీడదే॥

చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా (2) అరె ఆర్మ్‌స్ట్రాంగా... చెక్కిలిని దోచినది నేనేగా... అరె నేనేగా కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి