చిత్రం: రక్షకుడు (1997)
సాహిత్యం: భువన చంద్ర
గానం: రంగన్
సంగీతం: ఏ ఆర్ రెహమాన్
కలవా కన్నె కలవా శిలవా స్వర్ణ శిలవా కొంటె చూపుల కలవాణి యవ్వన దేశపు యువరాణి కౌగిలి కోసం అలుక ఎందుకే పలుకే రాదా అలివేణి మల్లియ నీవై చేరుకుంటే మథన తాపం తీరదటే చిలిపి ఆశ తలుపు తడుతుంటే తనువే లయగా ఊగదటే కలలు పంచే కలవాణి పెదవి పెదవి జాతకాని వలపు కోసం పిలుపులెందుకే మనసే నీదే మహారాణి నింగిలోని చందమామ నీటనున్న కలువ భామ ఒకరికొకరు కబురు పంపే సమయమిదియే సఖీ మనసార వినవే చెలీ పువ్వుకుండే బరువు స్వల్పం గాలికుండే బరువు స్వల్పం కోడె వయసున కన్నె బరువు - బరువు కాదే చెలి అతి స్వల్పమేనే చెలి కనులకెన్నడు కంటిపాప భారమెన్నడు కానే కాదు నీ చిలిపి నగవు చూస్తు ఉంటే అలుపు సోలుపు దరికి రావు ||2|| నిన్ను నేను ఎత్తుకుంటే ఉడుకు వయసు వణికేనే నిన్ను నేను హత్తుకుంటే నింగి నేల కలిసేనే నీమీదొక్క చూపు పడినా యదలో మంట రగిలేనే కొంటె చూపుల కలవాణి యవ్వన దేశపు యువరాణి కౌగిలి కోసం అలుక ఎందుకే పలుకే రాదా అలివేణి కలలు పంచే కలవాణి పెదవి పెదవి జాతకాని వలపు కోసం పిలుపులెందుకే మనసే నీదే మహారాణి కలవా కన్నె కలవా శిలవా స్వర్ణ శిలవా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి