Rakshakudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rakshakudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, డిసెంబర్ 2024, మంగళవారం

Rakshakudu : Chanduruni Takinadi Song Lyrics (చందురుని తాకినది)

చిత్రం: రక్షకుడు (1997)

సాహిత్యం: భువన చంద్ర

గానం: హరిహరన్, సుజాత మోహన్

సంగీతం: ఏ ఆర్ రెహమాన్


పల్లవి :

చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా (2) అరె ఆర్మ్‌స్ట్రాంగా... చెక్కిలిని దోచినది నేనేగా... అరె నేనేగా కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం (2)॥ చందురుని తాకినది నీవేగా... అరె నీవేగా వెన్నెలని దోచినది నీవేగా... అరె నీవేగా వయసు వాకిలిని తెరిచె వయ్యారం నీ కలల మందారం శ్రుతిలయల శృంగారం

చరణం : 1

పూవులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే (2) పైటచాటు పున్నమిలా పొంగే మధురిమలే తలపుల వెల్లువలో తలగడ అదుముకున్నా తనువుని పొదువుకొని ప్రియునే కలుసుకున్నా తాపాల పందిరిలో దీపమల్లె వెలుగుతున్నా మగసిరి పిలుపులతో తేనెలాగ మారుతున్నా కోరికల కోవెలలో కర్పూరమౌతున్నా॥

చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా (2) అరె ఆర్మ్‌స్ట్రాంగా... చెక్కిలిని దోచినది నేనేగా... అరె నేనేగా కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం (2)॥ చందురుని తాకినది

చరణం : 2

రమ్మనే పిలుపు విని రేగుతోంది యవ్వనమే ఏకమై పోదామంటూ జల్లుతోంది చందనమే నీటిలోని చేపపిల్ల నీటికి భారమౌనా కోరుకున్న ప్రియసఖుడు కౌగిలికి భారమౌనా చెంతచేర వచ్చినానే చేయిజారిపోకే పిల్లా పిల్లగాడి అల్లరిని ఓపలేదు కన్నెపిల్ల అలిగిన మగతనమే పగబడితే వీడదే॥

చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా (2) అరె ఆర్మ్‌స్ట్రాంగా... చెక్కిలిని దోచినది నేనేగా... అరె నేనేగా కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం

Rakshakudu : Kalva Kane Kavala Song Lyrics (కలవా కన్నె కలవా)

చిత్రం: రక్షకుడు (1997)

సాహిత్యం: భువన చంద్ర

గానం: రంగన్

సంగీతం: ఏ ఆర్ రెహమాన్



కలవా కన్నె కలవా శిలవా స్వర్ణ శిలవా కొంటె చూపుల కలవాణి యవ్వన దేశపు యువరాణి కౌగిలి కోసం అలుక ఎందుకే పలుకే రాదా అలివేణి మల్లియ నీవై చేరుకుంటే మథన తాపం తీరదటే చిలిపి ఆశ తలుపు తడుతుంటే తనువే లయగా ఊగదటే కలలు పంచే కలవాణి పెదవి పెదవి జాతకాని వలపు కోసం పిలుపులెందుకే మనసే నీదే మహారాణి నింగిలోని చందమామ నీటనున్న కలువ భామ ఒకరికొకరు కబురు పంపే సమయమిదియే సఖీ మనసార వినవే చెలీ పువ్వుకుండే బరువు స్వల్పం గాలికుండే బరువు స్వల్పం కోడె వయసున కన్నె బరువు - బరువు కాదే చెలి అతి స్వల్పమేనే చెలి కనులకెన్నడు కంటిపాప భారమెన్నడు కానే కాదు నీ చిలిపి నగవు చూస్తు ఉంటే అలుపు సోలుపు దరికి రావు ||2|| నిన్ను నేను ఎత్తుకుంటే ఉడుకు వయసు వణికేనే నిన్ను నేను హత్తుకుంటే నింగి నేల కలిసేనే నీమీదొక్క చూపు పడినా యదలో మంట రగిలేనే కొంటె చూపుల కలవాణి యవ్వన దేశపు యువరాణి కౌగిలి కోసం అలుక ఎందుకే పలుకే రాదా అలివేణి కలలు పంచే కలవాణి పెదవి పెదవి జాతకాని వలపు కోసం పిలుపులెందుకే మనసే నీదే మహారాణి కలవా కన్నె కలవా శిలవా స్వర్ణ శిలవా


Rakshakudu : Ninne ninne Song Lyrics (నిన్నే నిన్నే పిలచినది)

చిత్రం: రక్షకుడు (1997)

సాహిత్యం: భువన చంద్ర

గానం: K. J. యేసుదాస్, సాధన సర్గం

సంగీతం: ఏ ఆర్ రెహమాన్




నిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినది నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది కన్నుల కరిగిన యవ్వనమా ఒంటరి బ్రతుకే నీదమ్మా నిన్నటి కధలే వేరమ్మా నిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినది నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది

పువ్వా పువ్వా నీ ఒడిలో ఒదిగిన క్షణం ఎక్కగే.. కలిగిన సుఖం ఎక్కడే అభిమానంతో తలవంచినా ప్రేమకి చోటెక్కడే నిలిచితి నేనిక్కడే కళ్ళలోని ముళ్ళుంటే కనులకి నిదరెక్కడే వలచినవారే వలదంటే మనిషికి మనసెందుకే నిన్నటి వలపే నిజమని నమ్మాను నిజమే తెలిసి మూగబోయి వున్నాను నిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినది నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది కళ్ళలోని ఆశా కరగదులే కౌగిలిలోనే చేర్చులే నిన్నటి బాధా తీర్చులే నిన్నే నిన్నే ...నిన్నే నిన్నే .... నిన్నే నిన్నే....

ప్రేమా ప్రేమా నా మనసే చెదిరిన మధువనమే వాడిన జీవితమే విరహమనే విధి వలలో చిక్కిన పావురమే మరచితి యవ్వనమే కలలొనైనా నిన్ను కలుస్తా ఆగనులే ప్రియతమా లోకాలన్ని అడ్డుపడినా వీడను నిను నేస్తమా చీకటి వెనుకే వెలుగులు రావా భాధేతొలిగే క్షణమగుపడదా నిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినది నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది కళ్ళలోని ఆశా కరగదులే కౌగిలిలోనే చేర్చులే నిన్నటి బాధా తీర్చులే నిన్నే నిన్నే ...నిన్నే నిన్నే .... నిన్నే నిన్నే....