చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం (2024)
రచన: భాస్కర భట్ల రవి కుమార్
గానం: రమణ గోగుల, మధుప్రియ
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
పల్లవి :
హేయ్.. గోదారి గట్టు మీద రామచిలకవే ఓ..ఓ…. గోరింటాకేట్టుకున్న సందమామవే గోదారి గట్టు మీద రామచిలకవే గోరింటాకేట్టుకున్న సందమామవే ఊరంతా సూడు ముసుకే తన్ని నిద్దరపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఎం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క అడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవ్వరికి చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామచిలకనే హ.. గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే
చరణం:1 హేయ్ విస్తార మందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే ఛి ఛి ఛి సిగ్గెలేని మొగుడువారండోయ్ గుయ్ గుయ్ గుయ్ అంటూ మీదికిరాకండోయ్ వయ్ వయ్ వయ్ గంపెడు పిల్లల్తో ఇంటిని నింపవే చాప దిండు సంసారాన్ని మెడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దుయ్య గురుకెట్టి పాడుకోరే గురకలాగా మీవాళ్లు ఎం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్లయ్యి సానాల్లే అయినా గాని మాస్టారు తగ్గేదే లేదంటూ నా కొంగేనకే పడుతుంటారు హేయ్.. గోదారి గట్టు మీద రామచిలకవే గోరింటాకేట్టుకున్న సందమామవే
చరణం:2 హేయ్ హేయ్… ఉహు ఉహు లల లాల లాల .. ఊ… హే హేయ్.. ఓ.. హొయ్ లల లాల లాల .. ఊ… కొత్త కోకేమో కన్నె కొట్టింది తెల్లరేలోగా తొందర పడమని చెవిలో చెపిందే ఈ మాత్రం హింటే ఇస్తే సెంటె కొట్టైనా ఓ రెండు మూరల మల్లెలు చేతికి చూటైన ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటల్తోటి కాలషెపం మానేయ్ మంటుందే అబ్బాబ్బ కబాడీ కబాడీ అంటూ కూతకు వచైనా ఏవండోయ్ శ్రీవారు మల్లి ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం హేయ్ ఓసోసి ఇల్లాల బాగుందే నీ సహకారం ముద్దుల్తో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామచిలకనే (హుమ్ హుమ్ లలలా) హ.. నీ జంట కట్టుకున్న సందమామనే (హుమ్ హుమ్ లలలా)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి