27, డిసెంబర్ 2024, శుక్రవారం

Sruthilayalu : Inni Raasula Song Lyrics (ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ)

చిత్రం: శృతిలయలు (1987)

సాహిత్యం: అన్నమాచార్య

గానం: ఎ స్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్

సంగీతం: కె.వి.మహదేవన్



పల్లవి: 

ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ

ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ

కన్నె నీరాశి కూటమీ కలిగినరాశీ ఇంతిచలువపు రాశీ

ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ

కన్నె నీరాశి కూటమీ కలిగినరాశీ ఇంతిచలువపు రాశీ


చరణం:1

కలికి బొమవిండ్లుగలా కాంతకును ధనురాశీ 

వెలయు మీనాక్షినీ మీన రాశీ

కలికి బొమవిండ్లుగలా కాంతకును ధనురాశీ 

వెలయు మీనాక్షినీ మీన రాశీ

కులుకు కుచకుంభములా కొమ్మకునూ కుంభరాశి 

వెలుగు హరిమధ్యపునూ సింహరాశీ

ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ కన్నె 

నీరాశి కూటమీ కలిగినరాశీ ఇంతిచలువపు రాశీ


చరణం:2

చిన్ని మకరాంతపుపై యదచేడెకు మకరరాశీ 

కన్నె ప్రాయపు సతికీ కన్నె రాశీ

చిన్ని మకరాంతపుపై యదచేడెకు మకరరాశీ 

కన్నె ప్రాయపు సతికీ కన్నె రాశీ

వన్నెమైపైడి తులతూగు వనితకున్ తుల రాశీ

వన్నెమైపైడి తులతూగు వనితకున్ తుల రాశీ

పిన్ననివారి గొళ్ళసతికి వ్రుశ్చికరాశి

ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ


చరణం:3

ఆపుకొని మొరపులా వెరయునతివకూ వ్రుషభరాశీ

గామిడి గుట్టుమాటుల సతికీ కర్కటక రాశీ

ఆపుకొని మొరపులా వెరయునతివకూ వ్రుషభరాశీ

గామిడి గుట్టుమాటుల సతికీ కర్కటక రాశీ

కోమలపు చిగురు కోమలవతికీ మేషరాశీ

ప్రేమ వేంకటపతికలిసేప్రియ మిధునరాశీ

ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ కన్నె నీరాశి 

కూటమీ కలిగినరాశీ ఇంతిచలువపు రాశీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి