Sruthilayalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sruthilayalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, డిసెంబర్ 2024, శుక్రవారం

Sruthilayalu : Saranu Saranu Song Lyrics (శరణు శరణు )

చిత్రం: శృతిలయలు (1987)

సాహిత్యం:

గానం: ఎ స్పీ బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: కె.వి.మహదేవన్



జానకీ కాంత స్మరణం జయ జయ రాం హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ-2 శరణు రాక్షస గర్వ సంహర-2 శరణు వేంకట నాయక-2 స్వామి శ్రీ రఘు నాయక శరణు శరణూ...హరే... ఆ.. ఆఆ.. తనదు వరసత్వమును వారసత్వముగనిడి తనువిచ్చు తండ్రికిదే తొలి వందనం తండ్రికిదే తొలి వందనం మమతానురాగాల కల్పతరువై మంచిచెడు నేర్పంచు మొదటి గురువై ముక్కోటి వేల్పులను ఒక్క రూపున జూపు మాతృపద పద్మములకిదే వందనం వందనం... వందనం... నటరాజ చరణాబ్జ సంసర్గ పరిపూత నాట్య నిగమము దాల్చు రంగస్థలీ మాత తక ఝణుత తథిగిణత తోం తకిట తక తకిట జతుల సుమ గతులతో అభినందనం...అభినందనం..అభినందనం... ససస సగ సగస నిని సపనిస గసగమప మగ గమపనిప నిస గమపనిప గమ సపమ సమగ సమగ సగసనిప నిససస... సాగెనే నాట్య వేదం దిశల మ్రోగెనే ప్రణవ నాదం-2 శంభుని పదంబుజమ్ముల స్పర్శకు కుంభిని ముదంబుధిగ నుప్పొంగగ సాగెనే సాగెనే వేదం...నాట్య వేదం భం భంభం భంభం భంభం గిరి కందరములె శంఖములై నినదంచే పటు నిర్ఘోశం ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ జలద పటలముల ఢమరుధ్వనముల చెలగె నీలాకాశం ధిమిధిమి ధిమిధిమి ధింతక ధిమ్మను అభంగ తరంగ మృదంగ స్వరముల నిలింప ఝరీ విలాసం నతుల జతుల పటహాదివాద్యతటి చటల జటల చరలాడు తటిద్యుతి ధరాధరాత్మజ సహానువర్తిగ సురాలినుటించ స్వరారి ఘటించ సాగెనే సాగెనే సాగెనే నాట్య వేదం దిశల మ్రోగెనే ప్రణవ నాదం ఓం నమః శివాయ.. ఈశానస్సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వ భూతానాం ! బ్రహ్మధిపతిర్ బ్రహ్మణొదిపతిర్ బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం ! ఓం ఓం ఓం

Sruthilayalu : Sri Gananadham Song Lyrics (శ్రీ గణ నాథం భజామ్యహం)

చిత్రం: శృతిలయలు (1987)

సాహిత్యం: నారాయణ తీర్థ

గానం: పూర్ణ చందర్, వాణీ జయరామ్, ఎస్.శ్రీనివాస్

సంగీతం: కె.వి.మహదేవన్


పల్లవి: 

శ్రీ గణ నాథం భజామ్యహం శ్రీ-కరం చింతితార్థ ఫలదం అను పల్లవి :

శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం శ్రీ-కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం (శ్రీ) చరణం:

రంజిత నాటక రంగ తోషణం శింజిత వర మణి-మయ భూషణం ఆంజనేయావతారం సు-భాషణం కుంజర ముఖం త్యాగరాజ పోషణం (శ్రీ)

Sruthilayalu : Aalokaya Sree Bala Song Lyrics (ఆలోకయే శ్రీ బాలకృష్ణం ...)

చిత్రం: శృతిలయలు (1987)

సాహిత్యం: నారాయణ తీర్థ

గానం: వాణి జయరామ్

సంగీతం: కె.వి.మహదేవన్




ఆలోకయే శ్రీ బాలకృష్ణం ... ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ... ఆనంద సుందర తాండవ కృష్ణం సఖీ... ఆనంద సుందర తాండవ కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం చరణ నిక్వణిత నూపుర కృష్ణం కరసంగత కనక కంకణ కృష్ణం చరణ నిక్వణిత నూపుర కృష్ణం కరసంగత కనక కంకణ కృష్ణం కింకిణీ జాల ఘనఘణిత కృష్ణం కింకిణీ జాల ఘనఘణిత కృష్ణం లోకశంకిత తారావళి మౌక్తిక కృష్ణం మౌక్తిక కృష్ణం...   ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం నందనందనం అఖండ విభూతి కృష్ణం సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం నందనందనం అఖండ విభూతి కృష్ణం కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం కలికల్మష తిమిర భాస్కర కృష్ణం   ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం గోవత్సబృందా పాలక కృష్ణం కృత గోపికాజాల ఖేలన కృష్ణం గోవత్సబృందా పాలక కృష్ణం కృత గోపికాజాల ఖేలన కృష్ణం నందా సునందాదీ....ఆఆఆఆ.. ఆఆఆ నందా సునందాది.. సునందాది.. నందా సునందాది.. సునందాది.. సునందాది.. సునందాది... నందసునందాది వందిత కృష్ణం శ్రీ నారాయణ తీర్త వరద కృష్ణం శ్రీ నారాయణ తీర్త వరద కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ... సఖీ ...ఆనంద సుందర తాండవ కృష్ణం సఖీ ...ఆనంద సుందర తాండవ కృష్ణం తాండవ కృష్ణం..తాండవ కృష్ణం..తాండవ కృష్ణం

Sruthilayalu : Inni Raasula Song Lyrics (ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ)

చిత్రం: శృతిలయలు (1987)

సాహిత్యం: అన్నమాచార్య

గానం: ఎ స్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్

సంగీతం: కె.వి.మహదేవన్



పల్లవి: 

ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ

ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ

కన్నె నీరాశి కూటమీ కలిగినరాశీ ఇంతిచలువపు రాశీ

ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ

కన్నె నీరాశి కూటమీ కలిగినరాశీ ఇంతిచలువపు రాశీ


చరణం:1

కలికి బొమవిండ్లుగలా కాంతకును ధనురాశీ 

వెలయు మీనాక్షినీ మీన రాశీ

కలికి బొమవిండ్లుగలా కాంతకును ధనురాశీ 

వెలయు మీనాక్షినీ మీన రాశీ

కులుకు కుచకుంభములా కొమ్మకునూ కుంభరాశి 

వెలుగు హరిమధ్యపునూ సింహరాశీ

ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ కన్నె 

నీరాశి కూటమీ కలిగినరాశీ ఇంతిచలువపు రాశీ


చరణం:2

చిన్ని మకరాంతపుపై యదచేడెకు మకరరాశీ 

కన్నె ప్రాయపు సతికీ కన్నె రాశీ

చిన్ని మకరాంతపుపై యదచేడెకు మకరరాశీ 

కన్నె ప్రాయపు సతికీ కన్నె రాశీ

వన్నెమైపైడి తులతూగు వనితకున్ తుల రాశీ

వన్నెమైపైడి తులతూగు వనితకున్ తుల రాశీ

పిన్ననివారి గొళ్ళసతికి వ్రుశ్చికరాశి

ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ


చరణం:3

ఆపుకొని మొరపులా వెరయునతివకూ వ్రుషభరాశీ

గామిడి గుట్టుమాటుల సతికీ కర్కటక రాశీ

ఆపుకొని మొరపులా వెరయునతివకూ వ్రుషభరాశీ

గామిడి గుట్టుమాటుల సతికీ కర్కటక రాశీ

కోమలపు చిగురు కోమలవతికీ మేషరాశీ

ప్రేమ వేంకటపతికలిసేప్రియ మిధునరాశీ

ఇన్ని రాశులయునికీ ఇంతిచలువపు రాశీ కన్నె నీరాశి 

కూటమీ కలిగినరాశీ ఇంతిచలువపు రాశీ

Sruthilayalu : Telavaarademo Song lyrics (తెలవారదేమో సామి ... )

చిత్రం: శృతిలయలు (1987)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: K. J. యేసుదాస్

సంగీతం: కె.వి.మహదేవన్


పల్లవి: 

తెలవారదేమో సామి ... 
తెలవారదేమో సామి
నీ తలపులమునుకలో అలసిన దేవేరి అలమేలుమ౦గకూ .. 
తెలవారదేమో సామి
నీ తలపులమునుకలో అలసిన దేవేరి అలమేలుమ౦గకూ .. 
తెలవారదేమో సామి

చరణం:1

చెలువమునేలగ చె౦గటలేవని 
కలతకునెలవై నిలచిననెలతకు
చెలువమునేలగ చె౦గటలేవని 
కలతకునెలవై నిలచిననెలతకు
కలల అలజడి నిద్దుర కరవై - 
కలల అలజడి నిద్దుర కరవై
అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలుమ౦గకూ .. 
తెలవారదేమో సామి

చరణం:2

మక్కువమీరగ అక్కునజేరిచి 
అ౦గజుకేళి పొగుచు తేల్చగ
మక్కువమీరగ అక్కునజేరిచి 
అ౦గజుకేళి పొగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగా మరి మరి తలచగా
అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలుమ౦గకూ ..
తెలవారదేమో సామి గామపని
తెలవారదేమో సామి సానిదపమపమగనిసగామ
తెలవారదేమో సామి సానిదపమగమపసనిదపమగసనిరిమగరిసారినీస 
తెలవారదేమో సామి