14, డిసెంబర్ 2024, శనివారం

State Rowdy : Radha Radha Madilona Song Lyrics (రాధ రాధ మదిలోన మన్మధ గాధా)

చిత్రం: స్టేట్ రౌడీ (1989)

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

సంగీతం: బప్పి లాహిరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,పి. సుశీల



పల్లవి:

రాధ రాధ మదిలోన మన్మధ గాధా రాత్రి పగలూ రగిలించే మల్లెల బాధ పడగెత్తినా పరువాలతో కవ్వించకే కాటెయ్యవే రాజ రాజ మనసైన మన్మధ రాజా రాత్రి పగలు రగిలింది మల్లెల బాధా నువ్వూదితే కాలాగదూ నేనాడితే నువ్వాగవూ రాధ రాధ మదిలోన మన్మధ గాధా రాజ రాజ మనసైన మన్మధ రాజా

చరణం 1:

స్వరాలు జివ్వు మంటె నరాలు కెవ్వుమంటే సంపంగి సన్నాయి వాయించనా పెదాలె అంటుకుంటే పొదల్లో అల్లుకుంటే నా లవ్వు లల్లాయి పాడించనా బుస కొట్టే పిలుపుల్లో కసి పుట్టే వలపుల్లో కైపెక్కి ఊగాలిలే రాజ రాజ మనసైన మన్మధ రాజా రాత్రి పగలు రగిలించే మల్లెల బాధా

చరణం 2:

పూబంతి పూతకొచ్చి చేమంతి చేతికిచ్చి పులకింత గంధాలు చిందించనా కవ్వింత చీర కట్టి కసి మల్లె పూలు పెట్టి జడ నాగు మెడకేసి బంధించనా నడిరేయి నాట్యంలో పడ గొట్టే లాస్యంలో చెలరేగి పోవాలిలే రాధ రాధ మదిలోన మన్మధ గాధా రాత్రి పగలూ రగిలించే మల్లెల బాధ పడగెత్తినా పరువాలతో కవ్వించకే కాటెయ్యవే రాజ రాజ మనసైన మన్మధ రాజా రాత్రి పగలు రగిలింది మల్లెల బాధా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి