State Rowdy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
State Rowdy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, డిసెంబర్ 2024, శనివారం

State Rowdy : Radha Radha Madilona Song Lyrics (రాధ రాధ మదిలోన మన్మధ గాధా)

చిత్రం: స్టేట్ రౌడీ (1989)

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

సంగీతం: బప్పి లాహిరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,పి. సుశీల



పల్లవి:

రాధ రాధ మదిలోన మన్మధ గాధా రాత్రి పగలూ రగిలించే మల్లెల బాధ పడగెత్తినా పరువాలతో కవ్వించకే కాటెయ్యవే రాజ రాజ మనసైన మన్మధ రాజా రాత్రి పగలు రగిలింది మల్లెల బాధా నువ్వూదితే కాలాగదూ నేనాడితే నువ్వాగవూ రాధ రాధ మదిలోన మన్మధ గాధా రాజ రాజ మనసైన మన్మధ రాజా

చరణం 1:

స్వరాలు జివ్వు మంటె నరాలు కెవ్వుమంటే సంపంగి సన్నాయి వాయించనా పెదాలె అంటుకుంటే పొదల్లో అల్లుకుంటే నా లవ్వు లల్లాయి పాడించనా బుస కొట్టే పిలుపుల్లో కసి పుట్టే వలపుల్లో కైపెక్కి ఊగాలిలే రాజ రాజ మనసైన మన్మధ రాజా రాత్రి పగలు రగిలించే మల్లెల బాధా

చరణం 2:

పూబంతి పూతకొచ్చి చేమంతి చేతికిచ్చి పులకింత గంధాలు చిందించనా కవ్వింత చీర కట్టి కసి మల్లె పూలు పెట్టి జడ నాగు మెడకేసి బంధించనా నడిరేయి నాట్యంలో పడ గొట్టే లాస్యంలో చెలరేగి పోవాలిలే రాధ రాధ మదిలోన మన్మధ గాధా రాత్రి పగలూ రగిలించే మల్లెల బాధ పడగెత్తినా పరువాలతో కవ్వించకే కాటెయ్యవే రాజ రాజ మనసైన మన్మధ రాజా రాత్రి పగలు రగిలింది మల్లెల బాధా

State rowdy : Are Moothi Meeda Song Lyrics (అరేయ్ మూతి మీద)

చిత్రం: స్టేట్ రౌడీ (1989)

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

సంగీతం: బప్పి లాహిరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



పల్లవి:

అరేయ్ మూతి మీద

మీసమున్నా రోషమున్నా

జబర్దస్తీ గబ్బర్నీ రా.. హా

అరె రౌడీలైనా కేడీలైనా

సాహో అంటూ సలాం కొట్టే సర్దార్ని రా.. హా

అరెరే యముడికి నే మొగుడినిరా

మనసుగల మనిషినిరా అభయమిదే

దనాధన్ దనాధన్

అబ్బబ్బ శివుడి వాలే తాండవమే

ఆడగల నటుడినిరా అడుగులివే దనాధన్ దనాధన్ 


అరె సెంటర్లో నా జెండా

యెగరేస్తే యెదురేడి భాయ్

నా కులుకు చూడు

నా నడక చూడు

నా దరువు చూడరా 


అరెరే యముడికి నే మొగుడినిరా

మనసుగల మనిషినిరా అభయమిదే

దనాధన్ దనాధన్

అబ్బబ్బ శివుడి వాలే తాండవమే

ఆడగల నటుడినిరా అడుగులివే 

దనాధన్ దనాధన్.. దనాధన్ 


చరణం 1:


హోయ్.. గరాలన్నీ మింగాకా

శివుడు తడబడగా

శివ శివ శివ శివ

ఆహా.. సుధాలెత్తుకొచ్చారు 

సురులు గడబిడగ

హర హర హర హర

ఈ దోపిడీలు ఆ నటివి

ఇక చెల్లబోవు ముమ్మాటికీ

ఈ స్టేట్ రౌడీని నేనై కలబడతా 

కలబడి నిలబడి అరేయ్ 

మీ వీధి కొచ్చానులే రా పనిపడగా

అరేయ్ డింత తంతా డింత హా



అరేయ్ మూతి మీద

మీసమున్నా రోషమున్నా

జబర్దస్తీ గబ్బర్నీ రా.. హా

అరె రౌడీలైనా కేడీలైనా

సాహో అంటూ సలాం కొట్టే సర్దార్ని రా.. హా

అరెరే యముడికి నే మొగుడినిరా

మనసుగల మనిషినిరా అభయమిదే

దనాధన్ దనాధన్

అబ్బబ్బ శివుడి వాలే తాండవమే

ఆడగల నటుడినిరా అడుగులివే 

దనాధన్ దనాధన్.. దనాధన్ 


చరణం 2:


అరెరెరెరెరెరె.... అరేయ్ కాళింది మడుగునా 

కృష్ణుడు అడుగిడగా పడీ పడీ పడీ పడీ 

హొయ్ గోపికలు ఆడారు

హాయిగా బయపడతా భలే భలే భలే భలే హొయ్ 

ఈనాడు ఆడెను కన్నయ్యల ఆడాళ్ళ తోడున్న 

అన్నయ్యలా అందరికి ఇస్తున్న హామీ ఉమ్మడిగా

యమా యమా యమా యమా అరేయ్ 

నేనుంటే భయంఇంకా ఏమి విడవనుగా

అరేయ్ డింత తంతా డింత త


అరేయ్ మూతి మీద

మీసమున్నా రోషమున్నా

జబర్దస్తీ గబ్బర్నీ రా.. హా

అరె రౌడీలైనా కేడీలైనా

సాహో అంటూ సలాం కొట్టే సర్దార్ని రా.. హా

అరెరే యముడికి నే మొగుడినిరా

మనసుగల మనిషినిరా అభయమిదే

దనాధన్ దనాధన్

అబ్బబ్బ శివుడి వాలే తాండవమే

ఆడగల నటుడినిరా అడుగులివే 

దనాధన్ దనాధన్.. దనాధన్ 


అరేయ్ మూతి మీద



13, జూన్ 2021, ఆదివారం

State Rowdy : Chukkala Pallakilo Song lyrics (చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో)

 

 చిత్రం : స్టేట్ రౌడీ

సంగీతం :  బప్పీలహరి

సాహిత్యం: సి.నారాయణ రెడ్డి

గానం: బాలసుబ్రహ్మణ్యం,సుశీల


F : చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో M : అనురాగాలే ఆలపించనా ఆకాశమే మౌనవీణగా M&F : ఆఆ.. చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో M : నీ చిరు నడుమున వేచిన సిగ్గును దోసిట దోచాలని F : ఆగని పొద్దును ఆకలి ముద్దును కౌగిట దువ్వాలని M : హే పడుచుదనం చెప్పిందిలే F : పానుపు మెచ్చిందిలే ..హా... M : చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో M : తలపులు ఉబికిన తొలకరి వయసుకు తొలిముడి విప్పాలని F : పెరిగే దాహం జరిపే మధనం పెదవికి చెప్పాలని M: హే తనువెల్లా కోరిందిలే.. F: తరుణం కుదిరిందిలే ఓ ఓ M : చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో F : అనురాగాలే ఆలపించనా ఆకాశమే మౌనవీణగా F : చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో

State Rowdy : Tadiginitohom thappadamma song lyrics (తధిగిణతోం కూ.తప్పదమ్మ .తడితాళం)

  చిత్రం : స్టేట్ రౌడీ

సంగీతం :  బప్పీలహరి

సాహిత్యం: వేటూరి

గానం: బాలసుబ్రహ్మణ్యం,సుశీల


తదిగినతోం హేయ్..తప్పదమ్మ తడితాళం తడబడినా.హేయ్... దక్కనీవే తొలి అందం హేయ్. నీవు జోలా పాడుతున్న ఆగదీ యమగోలా అరె.మాటా. మాటా. హహ. మల్లెతోట... హెహె అయితే జంట. హొహొ. నీతో ఉంటా. హా అదిరింది నాకు జోడి కుదిరింది... ముదిరింది. ముద్దు కాస్త ముదిరింది హేయ్ ఎంత జోలా పాడుతున్నా. గిల్లుతాడే గోలా .అరె మాటా. మాటా. హ.హ.. మల్లెతోటా... హెహె అయితే జంట... హైహై. నీతో ఉంటా అ.తధిగిణతోం కూ.తప్పదమ్మ... తడితాళం అదిరింది నాకు జోడి కుదిరింది... హా... జాలీ జానీ. నా లవ్లీ రాణి... నీ కొంగుకు ముడిపడిపో..నీ పోతేపోనీ. ఏమైనా కానీ... వయసుకు ఉడుకులు రా..నీ నీదే రోజా. నా సుప్రీం రాజా. నీ కౌగిట తలబడిపోనీ తాజాతాజా నా కౌగిలి లేజా. పెదవికి మధువులు రానీ అరే. కన్ను కన్నూ వేటాడాలా... నువ్వూ నేను ముద్దాడాలా ఈడు జోడు పెళ్ళాడాలా... రా..వే అంతో ఇంతో కవ్వించాలా... అందాలన్నీ నవ్వించాలా ఆకుసోకు పండించాలా... రారా తధిగిణతోం తోం. తప్పదమ్మ. ... తడితాళం అహహ అదిరింది నాకు జోడి కుదిరింది... హా... డీడీడిక్కి. నా చెంపే నొక్కి. నా వొంటికి అంటుకుపోరా నీ వేడికి. నా గోడే దూకి... వలపులు వలుచుకుపోరా నక్కి నక్కి నీ పండే దక్కి... నా ఆకలి తీర్చుకుపోనా ఎంతో లక్కీ... నీ జోడే దక్కి... తళుకులు తడుముకుపోనా ఉండీ ఉండీ ఊ కొట్టాలా... ఉయ్యాలూపి జోకొట్టాలా... వయ్యారాలే ఆకట్టాలా. రారా ముద్దుముద్దు ముట్టించాలా. రెచ్చిరేగి రెట్టించాలా ఒళ్ళో ఇల్లే కట్టించాలా. రావే... అదిరింది నాకు జోడి కుదిరింది... ముదిరింది. ముద్దు కాస్త ముదిరింది హేయ్. నీవు జోలా పాడుతున్న ఆగదీ యమగోలా అరె.మాటా. మాటా. హహ. మల్లేతోట... హెహె అయితే జంట. హహ. నీతో ఉంటా