చిత్రం: రాజా విక్రమార్క (1990)
రచన: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం:రాజ్-కోటి
పల్లవి:
M : నాగినివో భోగినివో కామకళా యోగినివో
వెన్నెలకి విభావనివో, జాబిలికి సహోదరివో
పానుపైనది నా ప్రాయం మసక రాతిరిలో
F : నాగవిభో నాకు ప్రభో నాట్యకళా నాధుడవో
కన్నెలకి వసంతుడివో, ఆమనిలో అనంతుడవో
కాటు కోరెను నా అందం కౌగిలింతలలో
M : నాగినివో భోగినివో కామకళా యోగినివో
చరణం 1:
F : చందనాల చెట్టు కింద తందనాలా పక్కవేశా
సాగనీరా .. .. రాసలీల
M : కుసమే విడినా కుర్రదానా రోసమే చూపనా రొంటిమీనా
F : వాటేస్తావో, కాటేస్తావో చాటే ముందే సర్పక్రీడల్లో
M : నాగినివో భోగినివో కామకళా యోగినివో
F : కన్నెలకి వసంతుడివో, ఆమనిలో అనంతుడవో
M : హో..పానుపైనది నా ప్రాయం మసక రాతిరిలో
F : నాగవిభో నాకు ప్రభో నాట్యకళా నాధుడవో
చరణం 2:
M : నాగులేటి కోనలోన రేవులేని నావలాగా రేగిపోనా రెచ్చిపోనా F : పుట్టలో పాలనే పోసుకోరా పూతలో తేనెలే దోచుకోరా M : ఉయ్యాలూగే వయ్యారాలే ఒళ్ళోకొచ్చే నాగానందంలో......... F : నాగవిభో నాకు ప్రభో నాట్యకళా నాధుడవో M : వెన్నెలకి విభావనివో, జాబిలికి సహోదరివో F : ఓ...కాటు కోరెను నా అందం కౌగిలింతలలో M : నాగినివో భోగినివో F : నాగవిభో నాకు ప్రభో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి