3, జనవరి 2025, శుక్రవారం

Aaradhana : Adadani Orachupulo Song Lyrics (ఆడదాని ఓరచూపుతో )

చిత్రం: ఆరాధన (1962 )

రచన: ఆరుద్ర

గానం: ఎస్. జానకి

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు



పల్లవి :

ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్ చరణం 1 : మిఠారి నవ్వులే మిఠాయి తీపులు.. కటారి రూపులోన కైపులున్నవి రంగేళి ఆటకు రడీగా ఉన్నది రంగేళి ఆటకు రడీగా ఉన్నది... కంగారు ఎందుకోయీ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్ చరణం 2 : ఖరీదు లేనివి ఖరారు అయినవి... గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి ఖరీదు లేనివి ఖరారు అయినవి... గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి మజాల సొగసులే ప్రజెంట్ చేసెద.. మజాల సొగసులే ప్రజెంట్ చేసెద... సుఖాల తేలవొయీ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి