3, జనవరి 2025, శుక్రవారం

Aaradhana : Vennelaloni Vikasame Song Lyrics ( వెన్నెల లోనీ వికాసమే)

చిత్రం: ఆరాధన (1962 )

రచన: శ్రీ శ్రీ

గానం: ఎస్. జానకి

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు



పల్లవి : వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా వేదన మరచి ప్రశాంతి గా నిదురించుము ఈ రేయి.. నిదురించుము ఈ రేయి.. వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా చరణం 1 : వాడని పూవుల తావితో..కదలాడే సుందర వసంతమీ కాలము కదలాడే సుందర వసంతమీ కాలము.. చెలి జోలగ పాడే వినోద రాగాలలో... చెలి జోలగ పాడే వినోద రాగాలలో... తేలెడి కల సుఖాలలో... నిదురించుము ఈ రేయీ.. నిదురించుము ఈ రేయీ వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా చరణం 2 : భానుని వీడని చాయగా... నీ భావము లోనే చరింతునోయీ సఖ నీ భావములోనే చరింతునోయీ సఖ నీ సేవలలోనే తరింతునోయీ సదా... నీ సేవలలోనే తరింతునోయీ సదా.. నీ ఎదలోనే వసింతులే... నిదురించుము ఈ రేయీ నిదురించుము ఈ రేయీ వెన్నెలలోనీ వికాసమే వెలిగించెద నీ కనులా వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈ రేయి.. నిదురించుము ఈ రేయి... నిదురించుము ఈ రేయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి