Aradhana(1962) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aradhana(1962) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జనవరి 2025, శుక్రవారం

Aaradhana : Englishlona Marriage Song Lyrics (ఇంగ్లీషులోన మేరేజీ)

చిత్రం: ఆరాధన (1962 )

రచన:  ఆరుద్ర

గానం:  ఘంటసాల, ఎస్. జానకి

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు



పల్లవి: 

ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ 
ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ 
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి 
ఆహా . . .ఆ .. ఆ 
ఓహో . . .హొ .. హో .. 

చరణం 1: 

ప్రేమించుకున్న పెళ్ళిలోనే హాయి ఉందోయీ 
పెద్దాళ్ళు దానికి సమ్మతిస్తే ఖాయమౌతుందోయ్ 
జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ 
జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ 
ఆ మాటకే నా గుండెలు గెంతేను తృళ్ళి తృళ్ళి 
ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ ఆహ... 
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి 

చరణం 2: 

న్యూఢిల్లినుండి సింగపూరు వెళ్ళిపోదాము 
న్యూయార్కులోన డాన్సుచేస్తూ ఉండిపోదాము 
కోసావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు 
కోసావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు 
రంగేళికి సింగారికి రారాదు పాడు సిగ్గు 
ఇంగ్లీషులోన మేరేజీ ఆహా.. హిందీలొ అర్థమూ షాదీ ఓహో... 
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి 

చరణం 3: 

పొంగేను సోడాగ్యాసు లాగా నేడు నీ మనసు 
మా నాన్న ముఖము చూడగానే నువ్వు సైలెన్సు 
తెస్తానులే లైసెన్సు కడదాము ప్రేమ హౌసు 
తెస్తానులే లైసెన్సు కడదాము ప్రేమ హౌసు 
నీమాటలే నిజమైనచో మన లైఫు నైసు నైసు 
ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ 
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి 
ఆహా . . . 
ఓహో . . .


Aaradhana : Ohoho Mamayya Song Lyrics (ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.)

చిత్రం: ఆరాధన (1962 )

రచన:  ఆరుద్ర

గానం:  ఘంటసాల, పి.సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు


పల్లవి :

ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా
ఇంటిని విడిచి షికారు కొడితే ఎంతో హాయి కలదయ్యా
ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ.. బలెబలె బతికిన కాలేజి
ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ.. బలెబలె బతికిన కాలేజి
మాటలు రాని మృగాలు కొన్ని మనిషి కి పాఠం చెబుతాయి 

చరణం 1:

పులులూ చిరుతలు సింహాలన్నీ వెలుపల తిరిగిన ప్రమాదమే..
ఓ మావయ్యా మావయ్యా
కొందరు ఘరాన మనుషులకన్నా క్రూరము కావీ జంతువులు..
ఓ అమ్మాయీ.. అమ్మాయీ
శౌర్యం పెరిగిన మనిషిని మృగాన్ని కటకటాలలో పెడతారు
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా

చరణం 2 :

గుర్రపు అంశం గాడిద వంశం చారల చారల జీబ్రావి
చుక్కల జిరాఫి ఒంటెకు బంధువు.. మనిషికి బంధువు చింపాంజిపంజి
మనిషి చేష్టలు కోతులకుంటే .. కోతి చేష్టలు కొందరివి..
వా...ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ..బలెబలె బతికిన కాలేజి

చరణం 3 :

తీరున తిరిగే నోరును తెరిచే ఏనుగు లాంటిది ఏమిటది..
ఓ మావయ్యా.. మావయ్యా
ఏనుగు వంటిది నీటిగుర్రము.. దానికి తమ్ముడు ఖడ్గమృగం
అధికులు పేదల కాల్చుకు తింటే.. ఇవి ఆకూ అలమే తింటాయి
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా

చరణం 4 :

రాజులు ఎక్కే అంబారీపై అందరు ఎక్కుట తప్పు కదా
రోజులు మారాయ్ž రాజులు పోయి ప్రజలే ప్రభువులు ఈనాడు..
అహ.. ప్రజలే ప్రభువులు ఈనాడు
మనుషుల పైన సవారికన్నా.. ఏనుగు సవారి నయం కదా
ఆ నిజం నిజం .. అహ మజా మజా
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా
ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ... బలెబలె బతికిన కాలేజి





Aaradhana : Na Hrudayamlo Nidurinche Cheli Song Lyrics (నా హృదయంలో నిదురించే చెలి)

చిత్రం: ఆరాధన (1962 )

రచన:  శ్రీ శ్రీ

గానం:  ఘంటసాల

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు




పల్లవి :

నా హృదయంలో నిదురించే చెలి
కలలలోనే కవ్వించే సఖి
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే


నా హృదయంలో నిదురించే చెలి 


చరణం 1 :

నీ కన్నులలోన దాగెనులే వెన్నెల సోన
కన్నులలోన దాగెనులే వెన్నెల సోన
చకోరమై నిను వరించి అనుసరించినానే..  కలవరించినానే


నా హృదయంలో నిదురించే చెలీ 


చరణం 2 :

నా గానములో నీవే ప్రాణముగ పులకరించినావే ..
ప్రాణముగా పులకరించినావే.. పల్లవిగా పలుకరించ రావే..
పల్లవిగా పలుకరించ రావే


నీ వెచ్చని నీడ.. వెలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడ.. వెలసెను నా వలపుల మేడ
నివాళితో చేయి సాచి ఎదురు చూచినానే.. నిదురకాచినానే
నా హృదయంలో నిదురించే చెలి
కలలలోనే కవ్వించే సఖి
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవే నన్ను దోచినావే


నా హృదయంలో నిదురించే చెలి 




Aaradhana : Nee Chelimi Song Lyrics (నీ చెలిమి నేడే కోరితినీ)

చిత్రం: ఆరాధన (1962 )

రచన: నార్ల చిరంజీవి

గానం: పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు


పల్లవి : నీ చెలిమి నేడే కోరితినీ.. ఈ క్షణమే ఆశ వీడితినీనీ చెలిమి... పూవు వలె ప్రేమ దాచితినీ పూజకు నే నోచనై తిని నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి చరణం 1 : మనసు తెలిసిన మన్నింతువని తీయని వూహల తేలితి నేనే మనసు తెలిసిన మన్నింతువని తీయని వూహల తేలితి నేనె పరుల సొమ్మై పోయినావని.. నలిగె నా మనసె నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి చరణం 2 : చెదరి పోయిన హృదయములోన.. పదిల పరచిన మమతలు నీకే చెదరి పోయిన హృదయములోన.. పదిల పరచిన మమతలు నీకే భారమైన దూరమైన.. బ్రతుకు నీ కొరకే నీ చెలిమి నేడె కోరితిని.. ఈ క్షణమే ఆశ వీడితిని.. నీ చెలిమి

Aaradhana : Vennelaloni Vikasame Song Lyrics ( వెన్నెల లోనీ వికాసమే)

చిత్రం: ఆరాధన (1962 )

రచన: శ్రీ శ్రీ

గానం: ఎస్. జానకి

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు



పల్లవి : వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా వేదన మరచి ప్రశాంతి గా నిదురించుము ఈ రేయి.. నిదురించుము ఈ రేయి.. వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా చరణం 1 : వాడని పూవుల తావితో..కదలాడే సుందర వసంతమీ కాలము కదలాడే సుందర వసంతమీ కాలము.. చెలి జోలగ పాడే వినోద రాగాలలో... చెలి జోలగ పాడే వినోద రాగాలలో... తేలెడి కల సుఖాలలో... నిదురించుము ఈ రేయీ.. నిదురించుము ఈ రేయీ వెన్నెల లోనీ వికాసమే వెలిగించెద నీ కనులా చరణం 2 : భానుని వీడని చాయగా... నీ భావము లోనే చరింతునోయీ సఖ నీ భావములోనే చరింతునోయీ సఖ నీ సేవలలోనే తరింతునోయీ సదా... నీ సేవలలోనే తరింతునోయీ సదా.. నీ ఎదలోనే వసింతులే... నిదురించుము ఈ రేయీ నిదురించుము ఈ రేయీ వెన్నెలలోనీ వికాసమే వెలిగించెద నీ కనులా వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈ రేయి.. నిదురించుము ఈ రేయి... నిదురించుము ఈ రేయి

Aaradhana : Adadani Orachupulo Song Lyrics (ఆడదాని ఓరచూపుతో )

చిత్రం: ఆరాధన (1962 )

రచన: ఆరుద్ర

గానం: ఎస్. జానకి

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు



పల్లవి :

ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్ చరణం 1 : మిఠారి నవ్వులే మిఠాయి తీపులు.. కటారి రూపులోన కైపులున్నవి రంగేళి ఆటకు రడీగా ఉన్నది రంగేళి ఆటకు రడీగా ఉన్నది... కంగారు ఎందుకోయీ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్ చరణం 2 : ఖరీదు లేనివి ఖరారు అయినవి... గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి ఖరీదు లేనివి ఖరారు అయినవి... గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి మజాల సొగసులే ప్రజెంట్ చేసెద.. మజాల సొగసులే ప్రజెంట్ చేసెద... సుఖాల తేలవొయీ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్