3, జనవరి 2025, శుక్రవారం

Aaradhana : Englishlona Marriage Song Lyrics (ఇంగ్లీషులోన మేరేజీ)

చిత్రం: ఆరాధన (1962 )

రచన:  ఆరుద్ర

గానం:  ఘంటసాల, ఎస్. జానకి

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు



పల్లవి: 

ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ 
ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ 
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి 
ఆహా . . .ఆ .. ఆ 
ఓహో . . .హొ .. హో .. 

చరణం 1: 

ప్రేమించుకున్న పెళ్ళిలోనే హాయి ఉందోయీ 
పెద్దాళ్ళు దానికి సమ్మతిస్తే ఖాయమౌతుందోయ్ 
జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ 
జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ 
ఆ మాటకే నా గుండెలు గెంతేను తృళ్ళి తృళ్ళి 
ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ ఆహ... 
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి 

చరణం 2: 

న్యూఢిల్లినుండి సింగపూరు వెళ్ళిపోదాము 
న్యూయార్కులోన డాన్సుచేస్తూ ఉండిపోదాము 
కోసావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు 
కోసావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు 
రంగేళికి సింగారికి రారాదు పాడు సిగ్గు 
ఇంగ్లీషులోన మేరేజీ ఆహా.. హిందీలొ అర్థమూ షాదీ ఓహో... 
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి 

చరణం 3: 

పొంగేను సోడాగ్యాసు లాగా నేడు నీ మనసు 
మా నాన్న ముఖము చూడగానే నువ్వు సైలెన్సు 
తెస్తానులే లైసెన్సు కడదాము ప్రేమ హౌసు 
తెస్తానులే లైసెన్సు కడదాము ప్రేమ హౌసు 
నీమాటలే నిజమైనచో మన లైఫు నైసు నైసు 
ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ 
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి 
ఆహా . . . 
ఓహో . . .


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి